మీ స్నేహితులతో పాటు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఇవే బెస్ట్..!

-

మీరు మీ స్నేహితులతో పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? నిజానికి ఒక్కసారైనా ఈ ప్రదేశాలకి మీ స్నేహితులతో వెళ్లాలి. అంత అద్భుతంగా ఉంటాయి ఈ ప్రదేశాలు. వీటిలో మీరు ఏదైనా మంచి ప్లేస్ కి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళచ్చు. ఇవే బెస్ట్ ప్లేసెస్.

ఈ ప్రదేశాలకు వెళ్లడం వలన మీకు ఎటువంటి నిరాశ కలగదు. కచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మరి స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలని అనుకునేవారు ఈ కథనాన్ని చూసి ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు ఆ ప్రదేశాల లిస్ట్ చూసేద్దాం.

లేహ్ లడఖ్:

అడ్వెంచర్లు ఇష్టపడే వారికీ లేహ్, లద్దాఖ్ పర్ఫెక్ట్. టిబెటన్ సంస్కృతి, వంటకాలు, పండుగలకు ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందింది. రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ ఇలా ఎన్నో వాటితో ఎంజాయ్ చేసేయచ్చు. అదిరిపోతోంది.

చిరపుంజి మేఘాలయ:

ఇక్కడకి కూడా వెళ్లి రావచ్చు. చిరపుంజి చూడడానికి ఎంతో బాగుంటుంది. “జ్యువెల్ క్రెస్ట్ ఆఫ్ మేఘాలయ” అని దీన్ని పిలుస్తారు. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలని అనుకునేవారు ఇక్కడకి కూడా వెళ్ళచ్చు.

కోజికోడ్ కేరళ:

స్నేహితులతో ఇక్కడకి వెళితే ఎంతో బాగుంటుంది. ఫుడీస్ కి అయితే మరీ బాగుంటుంది. ఇక్కడ బీచ్‌లు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జంతు సంరక్షణ కేంద్రాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఇక్కడ మీరు జలపాతాలు, నదులు ఇలా ఎన్నో చూడచ్చు.

గోవా:

పక్క పెళ్లి కి ముందు ఫ్రెండ్స్ తో చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. సీఫుడ్ బాగుంటుంది ఇక్కడ. అలానే ఇక్కడ ప్రకృతి కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. చారిత్రక కట్టడాలు, ట్రెక్కింగ్ మొదలైనవి కూడా మీరు ఎంజాయ్ చెయ్యచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news