చిన్నప్పుడే పిల్లలకి మంచి విషయాలని నేర్పాలి. అప్పుడే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచిని అనుసరిస్తారు. చెడు మార్గంలో కి వెళ్తారు. అందుకనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యత తెలిసేలా చెప్పడం వంటివి చేయాలి. అయితే బాల్యం నుండి పిల్లలకి బాధ్యతని ఎలా నేర్పాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకి బాధ్యత తెలియదు. ఒకవేళ వాళ్ళు ఏవైనా వస్తువులు పోగొట్టుకున్న దాని విలువ తెలియదు. జాగ్రత్తగా ఉంచుకోవడం వాళ్లకి రాదు పైగా జాగ్రత్తగా ఉంచుకోకపోతే అమ్మ నాన్న కొనిస్తారు అని అనుకుంటూ ఉంటారు. అంతేకానీ ఎప్పటికీ బాధ్యతని నేర్చుకోలేరు.
ఒకసారి వాళ్ళు ఇటువంటివి పోగొట్టుకున్నా వెంటనే తల్లిదండ్రులు కొనేసి ఇచ్చేయకూడదు. అప్పుడు వాళ్ళకి బాధ్యత రాదు. అందుకనే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు వాళ్లతో పోగొట్టుకుంటే వెంటనే ఇచ్చేయకుండా దాని విలువ చెప్పాలి. బాధ్యతగా వస్తువుల్ని ఉంచుకోవాలని చెప్పాలి.
బాధ్యతను పిల్లలకి ఇలా అలవాటు చేయండి:
పిల్లలకి వస్తువులు కొనేటప్పుడు వాళ్ళని కూడా తీసుకు వెళ్ళండి. ఏవైనా సామాన్లు లిస్టు తీసుకుని వెళ్లి వాళ్ళని వెతకమంది. బిల్లు వేసిన తర్వాత అన్ని సామాన్లు ఉన్నాయా లేదా చెక్ చేయమనండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక సారి పరిశీలించండి ఇలా వాళ్ళు సామాన్లు అన్నీ ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇలా నేర్పితే వారికి వాళ్ళ వస్తువులను కూడా బాధ్యతగా ఎలా ఉంచుకోవాలి అనేది తెలుస్తుంది. బాధ్యతగా ఉండాలని ఆలోచన కూడా వస్తుంది.
చదువుతో పాటుగా ఈ పనులు కూడా నేర్పండి:
వాటర్ బాటిల్స్ ఫిల్ చేయమనడం మొక్కలకు నీళ్లు పోయడం భోజనానికి కూర్చునే ముందు మంచినీళ్ళు పెట్టుకోవడం కూరగాయలు కడగమనడం ఇలా చిన్న చిన్న పనులు పిల్లలకు అలవాటు చేయండి అప్పుడు అన్నీ తెలుస్తాయి.