అబ్బాయిల్లో అమ్మాయిలని ఆకర్షించే లక్షణాలు ఇవే.. మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

ఆకర్షణ.. ప్రేమ.. పెళ్ళి.. జీవితం.. ఆకర్షణ నుండి మొదలైన ప్రేమ పెళ్ళి దాకా వెళ్ళి ఆ తర్వాత కలిసి జీవితాంతం ఇద్దరు మనుషుల్ని నడిపిస్తుంది. ఇంతటి ప్రాసెస్ కి కారణమైంది ఆకర్షణే. ఆకర్షణ కొద్ది కాలం మాత్రమే ఉంటుందని చెబుతారు. కానీ, ప్రేమ మొదలవ్వాలంటే, మొదట కలగాల్సింది ఆకర్షణే. అందుకే అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడానికి అబ్బాయిలు, అబ్బాయిల్ని అట్రాక్ట్ చేయడానికి అమ్మాయిలు తెగ కష్టపడుతుంటారు. ఐతే అమ్మాయిలని ఆకర్షించడానికి అబ్బాయిలు చేసే పనులు అందరికీ తెలిసిపోతుంటాయి. కానీ, అమ్మాయిలకి అబ్బాయిల్లో అట్రాక్ట్ చేసే అంశాలేంటో చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలేషన్ షిప్ లోకి దిగడానికి ఏవో అద్భుతాలు జరగాలని అనుకుంటారు. కానీ, రిలేషన్ షిప్ కోసం ఎదురుచూసే వాళ్ళకి మీరు కనిపించినపుడు, చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఐతే సాధారణంగా టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు, ఇతర అమ్మాయిలని చూసి, తమకి కూడా బాయ్ ఫ్రెండ్ కావాలని అనుకుంటారు.

ఎవరైనా అబ్బాయి తమ వెంట అదే పనిగా వెంటపడుతున్నాడని అనిపిస్తే, అతన్ని ఇష్టపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇబ్బంది పెట్టకుండా అమ్మాయి కోసం పిచ్చి ప్రేమని ప్రదర్శిస్తే, అట్రాక్ట్ అయ్యే అవకాశంఉంది.

అమ్మాయిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ, కనీసం తన వంక కూడా చూడని అబ్బాయిల గురించి అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు.

పాపులారిటీ వచ్చినపుడు.. ఏదైనా ఒక రంగంలో పాపులరై డబ్బు విపరీతంగా వస్తూ ఉంటే కూడా అట్రాక్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఐతే ఆకర్షణ ఎలాగైనా కలగవచ్చు. కానీ అది ప్రేమగా మారుతుందా లేదా అనేది వారిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే, ప్రతీ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితుల వల్లే ఆకర్షణ కలుగుతుందనుకోవడం కూడా కరెక్ట్ కాదు.