కుక్క ఏడిస్తే ఎవరికో మూడినట్లేనా..? ఇందులో నిజం ఎంత ఉంది..?

-

కుక్కలను పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. దాంతో ఆడుకుంటారు, ముచ్చట్లు పెడతారు, మీ ప్రేమను చూపిస్తారు. కానీ కుక్క ఏడిస్తే మాత్రం మనకు ఎక్కడ లేని టెన్షన్. భయపడతాం. కుక్కలు మూలిగినా, ఏడ్చినా యమధర్మరాజు వస్తాడనేందుకు సంకేతం అని చాలా మంది భావిస్తారు. వెంటనే దాన్ని మందలిస్తారు. ఆ ఏడుపు ఆపిస్తారు. ఓ వ్యక్తి మరణానికి చేరువైనప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులు ముందుగా గుర్తిస్తాయా? ఇందులో నిజమెంత ఉంది..?

ఈ నమ్మకం మన దేశంలో పుట్టినది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారు. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, మరణం సంభవించే అవకాశాలున్నాయని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందట. అలా అలా ఇతర దేశాలకు కూడా ఆ విశ్వాసం పాకింది. ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు అమెరికా రచయిత. కుక్క శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూశాకే అలా చేస్తుందని బాగా నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాలని కొందరు కొట్టిపడేసినా చాలామంది బలంగా నమ్ముతున్నారు.

కుక్కలు దెయ్యాన్ని చూడగలగడం, మరణాన్ని పసిగట్టడం అన్ని మూఢవిశ్వాసాలు అని హేతువాదులు అంటారు. ఇలాంటి వాటిని విశ్వసించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ అందుకు వివరణ ఇస్తున్నారు పండితులు. కుక్కలు మనిషిని వాసన ఆధారంగా పసిగడతాయి. అలాగే ఓ వ్యక్తి చావుకి దగ్గరైనప్పుడు ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను ముందుగా గుర్తించేస్తాయట. వాసన ద్వారా మరణాన్ని పసిగట్టగానే అలా ఏడుస్తాయంట. కొన్నిసార్లు అనారోగ్యం, ఆకలి కారణంగా కూడా కుక్కలు ఏడుస్తాయని చెప్పేవారున్నారు. కానీ కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తాయి. అంటే వాటికి ఆత్మలు కనిపించాయని అర్థం అని పండితులు అంటున్నారు.

కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అన్నది అపోహ మాత్రమే అని కొట్టిపడేయానికి ఏకైక కారణం ఇది సైంటిఫిక్‌గా నిరూపణ కాలేదు. కానీ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపుని అపశకునం, అశుభం అని చెబుతారు. ఇవి పక్కన పెడితే కుక్క ఏడిస్తే.. ఆ సౌండ్‌ మనకు ఇబ్బందిగానే ఉంటుంది కదా!

Read more RELATED
Recommended to you

Latest news