గడాల శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు

-

లంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవా చేస్తానన్నారు. ముషీరాబాద్ నుండి పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు గడాల . ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అంటూ డైలాగ్ కొట్టారు. కొత్తగూడెం నా అడ్డ.. అని ఇక్కడే పుట్టాను ఇక్కడే చస్తానన్నారు ఆయన. కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఆగస్టు 5 నుండి కొత్తగూడెంలో ప్రతి గడపకూ వెళ్తానని వెల్లడించారు గడాల.

Gadala Srinivasa Rao: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యూహం అదేనా? - NTV  Telugu

గత కొన్నిరోజులుగ గడాల పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైన గడాల ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా విషయంలో హైకోర్టు తీర్పుతో గడాల పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ నెలకొందనే వార్తలు వినిపించాయి. దాంతో కొత్తగూడెం నుండి ముషీరాబాద్ కు షిప్ట్ కాబోతున్నారనే సమాచారాలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఈ ప్రచారంపై డీహెచ్ స్పందించారు. ముషీరాబాద్ బరిలో ఉంటాననే వార్తల్లో నిజం లేదన్నారు. తాను కొత్తగూడెం బరిలోనే ఉంటానని వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news