శృంగారంలో ఆడవాళ్ళకు ఇబ్బంది లేకుండాఉంచడానికి మగవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

-

ఇరువురి కలయిక ఇద్దరికీ ఇష్టమైతేనే సాధ్యం అవుతుంది. లేదంటే ఆ కలయికకి అర్థమే లేదు. శృంగారంలో ఇద్దరికీ రకరకాల కోరికలు ఉంటాయి. చాలా రకాల అంచనాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు అనుకున్నదానికి జరుగుతున్నదానికి తేడా ఉంటుంది. అందుకే జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. శృంగారంలో మగవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ చర్చిద్దాం.

సినిమాల్లో చూపించినట్టుగా రొమాంటిక్ గా మీ జీవితం లేదని బాధపడవద్దు. అక్కడ నటీనటులు ప్రేక్షకుల కోసం నటిస్తుంటారు. సినిమాలు చూసి మీ బంధాన్ని తక్కువగా చూడవద్దు.

శృంగారం పట్ల మీకున్న ప్రాముఖ్యత మీ భార్యకి ఉండకపోవచ్చు. ఆమెకి ఇతర విషయాల్లో ఉన్న ప్రాముఖ్యత మీకు లేకపోవచ్చు. అందువల్ల ప్రతీదానికి అభిప్రాయం అనేసుకుని ఇబ్బంది పెట్టవద్దు.

శృంగారంలో రసాస్వదన పొందడానికి ఎలాంటి రహస్య ఫార్ములా లేదు. ఒకవేళ ఉందని మీరు భావిస్తే, అది ఒక రెసిపీలాగా ఉంటుందే తప్ప అందులో ఎలాంటి ఫీలింగ్ ఉండదు. అదీగాక మీ భార్య, ఆ సీక్రెట్ ఫార్ములాను మార్చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫార్ములా జోలికి వెళ్ళకుండా ఆనందించడం అలవాటు చేసుకోండి.

మహిళలు తమ అందం విషయంలో అభద్రతా భావానికి లోనవడం చాలా సహజం. తమ కంటే కొద్దిగా అందంగా ఉన్నవారు కనిపించినపుడు ఇలా జరుగుతుంటుంది. అలా కాకపోయినా చాలామంది ఈ విషయంలో ఫీలవుతుంటారు. అందుకే ఆమె గురించి మీరు మాట్లాడాలి. అందం గురించి వర్ణించాలి. అప్పుడే ఆమెలో అభద్రతాభావం తగ్గి కోరికలు పెరుగుతాయి.

కేవలం శృంగారం కోసమే కాకుండా మీ భార్యతో కాలం గడిపితేనే ఆమెకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంలో జరిగే కలయిక మధురంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news