మీ కలలోకి ఎప్పుడైనా ఈ జంతువులు కనిపించాయా.. అ‌వి వస్తే ఏం జరుగుతుందంటే..!

మనం మాంచి నిద్రలో ఉన్నప్పుడు మనకు కొన్ని రకాల కలలు వస్తాయి. అ‌వి ఎందుకు వచ్చాయో మనకు అస్సలు అర్థంకాదు. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్నిసార్లు అయితే మనల్ని ఎవరో చంపుతున్నట్లు, తరుముతున్నట్లు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం గట్టిగా అరవాలని బాగా ప్రయత్నిస్తామ్..కానీ ఎంత అరిచినా శబ్ధంరాదు..ఇక గట్టిగా ఒకేసారి అరిచేస్తేం..కట్ చేస్తే అది పైకి వినబడి పక్కనోళ్లు లేస్తారు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో కూడా ఏదో ఒకటైంలో జరిగుతాయి. ఇంకా హైలెట్ ఏంటంటే..లేచాక అసలు మనకు ఏం గుర్తుకుఉండదు. కొన్నిసార్లు మనకలలోకి జంతువులు వస్తుంటాయి. ఈ కింద పేర్కొన్న జంతువులు మీ కలలోకి వస్తే దాని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. గుడ్లగూబ

గుడ్లగూబకు దేవతల వాహనంగా గుర్తింపు ఉంది. కానీ కొందరు గుడ్లగూబ ఎదురైతే అదేదో అరిష్టంగా భావిస్తారు. చాలామందికి గుడ్లగూడ అంటే భయం కూడా.. కానీ, కలలో గుడ్లగూబ కనిపిస్తే.. వారికి ధనలక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుందని చెబుతుంటారు.

2. పాములు

వామ్మో పాములు తరుచు కలలోకి వచ్చాయంటే ఇక వారికి ఏదో సర్పదోషం పట్టుకుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. పాములంటే అందరికి భయమే. అయితే పాములు వచ్చినంతమాత్రాన సర్పదోషం ఉన్నట్లు కాదంట..అవి కనిపించే తీరును బట్టి బేస్ ఐ ఉంటుంది. కొన్నిసార్లు పాములు మీ విజయానికి సహకరిస్తుందట. కానీ కొన్నిసార్లు పాములు మీపైకి బుసలు కొడుతూ లేదా మీ వెంట పడుతున్నట్లు కల వస్తే త్వరలో మీకు కష్టాలు రాబోతున్నట్లు అర్థమట.

3. ఏనుగు

కలలో ఏనుగు కనిపించింది అంటే.. మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్ధమట.ఒకవేళ అలాకాకుంటే మీకు ఇప్పటికే ఉన్న ఆర్ధిక ఇక్కట్లు తొలగిపోయి.. ఎదో ఒక విధంగా ధనం చేకూరుతుందట.

4. ఆవు

మీ కలలోకి ఎప్పుడన్నా ఆవు వచ్చిందా..? ఆవు కలలోకి వచ్చిందంటే మంచిదే. మీరు దైవ భక్తులని అర్ధం. దైవారాధన చేస్తుంటారని, సాటి మనుషుల పట్ల సాత్వికంగా ప్రవర్తిస్తూ ఉంటారని అర్ధం. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతున్న రోజులలో.. మీ కలలోకి ఆవు వచ్చిందంటే మీ పని విజయవంతంగా పూర్తి అయిపోతుందట.
ఇదండి. ఇవి ఎప్పుడైనా మీ కలలోకి వచ్చేఉంటాయి కదా..కంప్యూటర్ కాలంలోనూ ఇదంతా ఏంటి అనుకుంటున్నారు. కొన్నింటి సమాధానం సైన్స్ కూడా చెప్పలేదు. గమనిక. ఈ కథనం ఈ శాస్ర్తానికి సంబంధించిన నిపుణులు చెప్పిన వాటిని ఆధారంగా చేసుకుని రాయబడింది కానీ మనలోకం సొంతంగా రాసిందికాదు.