ఆడవాళ్ళ నుండి మగాళ్ళు కోరుకునే విషయాలివే.

-

ఆడ, మగ బంధం బాగుండాలంటే అనేక విషయాలు పరిగణలోకి వస్తాయి. అందులో ఒకరి పట్ల ఒకరు ప్రేమ ప్రకటించుకోవడం ముఖ్యం. సాధారణంగా ఆడవాళ్ళ నుండి మగాళ్ళు కోరుకునే కొన్ని విషయాలు ఉంటాయి. అవి మగాళ్ళను ఉత్తేజ పరుస్తాయి. బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నాకు నీ మీద నమ్మకం ఉంది

ఈ మాటలు ఆడవాళ్ళ నుండి వచ్చినపుడు మగాళ్ళు ఉప్పొంగిపోతారు. అవతలి వారికి భద్రత ఇస్తున్నామన్న భావన వారిలో కొత్త శక్తిని పుట్టిస్తుంది. వారిలో నమ్మకాన్ని మరింత పెంచి, మీపై ప్రేమను ఇంకా పెంచేలా చేస్తుంది.

చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నావు

మగాళ్ళందరూ వారికి తోచినంతలో ఆడవాళ్ళకు అందంగా కనిపించడానికే ప్రయత్నిస్తారు. అయినా సరే మీరొక్కసారి మీరు చాలా బాగున్నారు అని మాట చెప్పాలని కోరుకుంటారు.

వేరే వాళ్ళలా నువ్వు కాదు

గుంపులో ఒకరిగా ఉండడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఈ విషయం ఆడవాళ్ళు గుర్తించి, నువ్వు ఇతరుల లాగా కాదు అని చెప్పాలని కోరుకుంటారు. అలా చెప్పారంటే వారిలో వెయ్యి వోల్టుల విద్యుత్ ఎక్కినట్టు ఫీలవుతారు.

నన్నెప్పుడూ నవ్వించడానికే ప్రయత్నిస్తావు

చాలామంది మగాళ్ళు అభద్రతాభావంతో ఉంటారు. మీరిలా మాట్లాడినపుడు వారిలో నమ్మకం పెరుగుతుంది. తమతో స్నేహంగా ఉన్నవారు, తమ ప్రెసెన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారన్న భావన వారిలో కాన్ఫిడెన్స్ పెంచేలా చేస్తుంది.

ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్.

చాలామంది మగాళ్ళు కోరుకునే ముఖ్య కోరిక ఇదే. స్నేహితులతో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చెయ్ అని చెప్పాలని కోరుకుంటారు. చాలామందికి తీరని కోరిక ఇది. తీరిన వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పవచ్చు.

నువ్వెలా ఉన్నా నాకిష్టమే

ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు., ఈ విషయం తెలుసుకుని వాళ్ళ లోపాలను కూడా ప్రేమించండి. అలా మీరు ప్రేమించినపుడు, ఆ మాట వారితో చెప్పినపుడు వారు మరింత ఉబ్బితబ్బిబ్బవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news