1.3 లక్షల అకౌంట్లను తీసేసిన వాట్సప్.. ఎందుకో తెలిస్తే మీరు షాకే..!

-

వాట్సప్.. ఇప్పుడు దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కొన్ని అప్ డేట్స్ ఇస్తూ.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది వాట్సప్. అయితే ఇప్పుడు వార్తల్లో నిలిచింది దేనికో తెలుసా?

వాట్సప్ యాప్ నుంచి దాదాపు 1.3 లక్షల అకౌంట్లను వాట్సప్ డిలీట్ చేసిందట. అవును… చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్ ను వాళ్లు షేర్ చేస్తున్నందుకు.. ఆయా ఖాతాలను వాట్సప్ డిలీట్ చేసింది.

వివిధ సెక్యూరిటీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల రిక్వెస్ట్ మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు వాట్సప్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా గూగుల్ అశ్లీల కంటెంట్ ను షేర్ చేస్తున్న అకౌంట్లను గుర్తించి ఆటోమెటిక్ గా ఆయా ఖాతాలను డిలీట్ చేసింది వాట్సప్.

Read more RELATED
Recommended to you

Latest news