వాట్సాప్ లో కొత్త ఫీచ‌ర్లు.. ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే..!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల సంఖ్య ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతోంది కూడా. అందులో భాగంగానే యూజ‌ర్ల‌కు సౌక‌ర్యంగా ఉండేలా వాట్సాప్ ను తీర్చిదిద్దుతున్నారు. కాగా వాట్సాప్ తాజాగా రెండు వార్త‌ల‌ను త‌న యూజర్ల‌కు మోసుకొచ్చింది. ఒక చేదు వార్త‌. మ‌రొక‌టి శుభవార్త‌. అవేమిటంటే… ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగదారుల డేటా.. మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు అన్నీ గూగుల్‌ డ్రైవ్‌లో ఎన్నాళ్లయినా బ్యాకప్‌ చేసుకోవచ్చు. కానీ ఇక‌పై అలా వీలు కాదు. అంటే.. ఇప్పుడు వాట్సాప్ బ్యాక‌ప్‌పై కోత విధించింది. అదేమిటంటే.. కేవలం ఒక సంవత్సరం డేటా మాత్రమే డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు. అంటే ఏడాది క్రితం డేటా ఆటోమేటిగ్గా డ్రైవ్‌ నుంచి డిలీట్‌ అయిపోతుంది. నవంబర్‌ 12, 2018 తర్వాత ఈ ఆటోమేటిక్‌ డిలీట్‌ను వాట్సాప్‌ ప్రారంభించనుంది. ఈ లోగా డ్రైవ్‌లో ఉన్న పాత డేటాను మీరు వేరే పద్ధతిలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.

ఇక వాట్సాప్ వినియోగదారులకు తీసుకువ‌చ్చిన శుభవార్త ఏమిటంటే… ఇప్పటివరకు గూగుల్‌ డ్రైవ్‌లో వాట్సాప్‌ ఛాట్‌ బ్యాకప్‌ చేసుకుంటే… మీకు ఇచ్చిన సాధారణ స్టోరేజీ (15 జీబీ)లో అంత మొత్తం డేటా వినియోగించినట్లు అయ్యేది. ఉదాహరణకు మీ వాట్సాప్‌ ఛాట్‌ బ్యాకప్‌ 500 ఎంబీ ఉందనుకోండి… మీ జీమెయిల్‌ స్టోరేజీలో అంత మొత్తం స్టోరేజీ సామర్థ్యం తగ్గిపోయేది. అయితే గూగుల్‌, వాట్సాప్‌ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ ఇబ్బంది తొలగిపోయింది. అంటే.. ఇకపై వాట్సాప్‌ ఛాట్‌ బ్యాకప్‌ మెమొరీని గూగుల్‌ స్టోరేజీలో లెక్కించదు. అంటే ఇకపై వాట్సాప్‌ బ్యాకప్‌ అన్‌లిమిటెడ్‌ అన్నమాట. అంటే.. వాట్సాప్‌లో యూజ‌ర్ల‌కు వ‌చ్చే ఫొటోలు, వీడియోల‌ను ఎన్నింటినైనా అన్‌లిమిటెడ్‌గా బ్యాక‌ప్ తీసుకోవ‌చ్చు.

నవంబరు 12, 2018 ఒక యూజర్‌కు గూగుల్‌ డ్రైవ్‌లో కేటాయించిన స్టోరేజ్‌ కోటా నుంచి వాట్సాప్‌నకు మినహాయింపు లభిస్తుంది. వాట్సాప్‌కు సంబంధించిన ఫైల్స్ స్టోరేజ్ ఎంత ఉన్నా స‌రే అది గూగుల్ డ్రైవ్‌లో కౌంట్ కాదు. అలా అన్‌లిమిటెడ్ బ్యాక‌ప్ ల‌భిస్తుంది. అయితే, ఏడాదికి మించి డ్రైవ్‌లో ఉన్న సమాచారం ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. దాన్ని గూగుల్‌ డ్రైవ్‌ నుంచి తొలగిస్తాం.. అని వాట్సాప్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. అయితే ప్ర‌స్తుతం ఈ రెండు ఫీచర్లు కేవ‌లం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్‌ను వాడుతున్న వారికి మాత్ర‌మే అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో వీటిని అప్‌డేట్ చేసే అవ‌కాశం ఉంది.

క‌నుక నవంబరు 12, 2018లోగా వాట్సాప్‌లో ఉన్న మీ పాత డేటాను మ్యాన్‌వల్‌గా బ్యాకప్‌ తీసుకోండి. అంతేకాకుండా, ఇప్పటివరకూ గూగుల్‌ డ్రైవ్‌కు అనుసంధానం కాని వారు వెంటనే డ్రైవ్‌కు అనుసంధానమైన డేటాను అందులోకి మార్చుకోండి. ఇక బ్యాకప్‌ ఫైల్స్‌ ఎక్కువ సైజ్‌ ఉంటే వైఫైని ఉపయోగించి సమాచారాన్ని బ్యాకప్‌ చేసుకోవడం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news