అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనందరికి తెలుసు. ఈ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడానికా? లేదా ఆందోళనలు నిర్వహించడానికా? అసలు దేనికోసం నిర్వహించుకుంటారో తెలుసా?
శతాబ్దం కిందట మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మహిళలకు ప్రత్యేకమైందిగా గుర్తించారు. ఎందుకో తెలుసుకుందాం.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మికుల ఉద్యమాల నుంచి పుట్టుకువచ్చింది. దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చింది. ప్రతి సంవత్సరం వేడుకలు కూడా నిర్వహిస్తోంది. ఈ వేడుకలను కేవలం ఒక దేశంలో ఉండే మహిళలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని క్లారా జెట్కిన్‌ అనే మహిళది. కోపెన్‌హెగెన్‌లో 1910లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌’ సమావేశంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై క్లారా నిర్ణయాన్ని ఏకగ్రీవం చేశారు.

అసలు దీనికి పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. మహిళలకు మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు, ఆరోగ్యం, తక్కువ పనిగంటల కోసం న్యూయార్క్‌ సీటీలో దాదాపు 15 వేల మంది మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అమెరికా సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

మొదటిసారి నిర్వహించిన దేశాలు

మహిళా దినోత్సవాన్ని మొదటిసారి 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో నిర్వహించారు.
1975 నుంచి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. ప్రతియేడు ఒక థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తొలి థీమ్‌ని ‘గతాన్ని వేడుక చేసుకొని, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం’ అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. పనిచేసే మహిళలు కేవలం పదిశాతం మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో మహిళలు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికి ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

అసలు మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి?

1917 యుద్ధంలో రష్యా మహిళలు శాంతి నిరసన చేశారు. ఆ సమయంలో కొన్ని రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్‌ నికోలస్‌ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం మíß ళలకు ఓటువేసే హక్కును కల్పించింది. మహిళలు సమ్మెకు దిగిన రోజు అప్పటి రష్యా కేలెండర్‌ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగేరియన్‌ కేలెండర్‌ ప్రకారం మార్చి 8.æరష్యాలో నాలుగురోజుల పాటు వేడుకలు చేసుకుంటారు. 8 కి ముందు ఆ తర్వాత పూల కొనుగోళ్లు కూడా అధికమవుతాయి. ఆ రోజు సెలవుదినంగా పాటిస్తారు. చైనాలో సగం రోజు సెలవు లభిస్తుంది. ఇంకా ఇప్పటికీ చాలా సంస్థల్లో కనీసం సగం రోజు కూడా సెలవు ఇవ్వట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news