మెక్సికో వలసలు అమెరికన్లకు ఎందుకు నచ్చదు…?

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ప్రధానంగా ఇచ్చిన హామీల్లో… తాను అమెరికా అధ్యక్షుడిని అయితే అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతాను, అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకుంటానని… దీనితో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున బ్రహ్మరధం పట్టారు. ట్రంప్ చెప్పిన ఆ మాటలను ట్రంప్ నమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి… మెక్సికో వలన అమెరికన్లు చాలానే నష్టపోతున్నారని… సాధారణంగా అమెరికాలో వ్యవసాయ కూలీలు ఎక్కువగా దొరకరు… దీనితో మెక్సికో నుంచి వలస వచ్చిన వారిని రైతులు తమ వ్యవసాయ పనులకు తీసుకుంటున్నారు.

వ్యవసాయ కూలీల్లో 60 శాతం మంది మెక్సికో వాళ్ళే అమెరికాలో ఉంటారని అక్కడి నివేదికలు చెప్తున్నాయి. ఇక మరికొందరు అయితే అమెరికాలో మాదక ద్రవ్యాల విక్రయానికి వస్తూ ఉంటారని అమెరికా అధికారులు చెప్తున్నారు. మెక్సికోలో డ్రగ్స్ తయారీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనితో డ్రగ్స్ ముఠాలు అక్రమంగా అమెరికాలోకి వస్తున్నారని ఎప్పటి నుంచో అమెరికా ఆరోపిస్తుంది. ఇక మరికొందరు అయితే… అమెరికాలో సంపన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారిలో ఎక్కువ మంది మెక్సికో వారే ఉంటున్నారు. మెక్సికోలో ఉపాధి తక్కువగా ఉంటుంది. దీనితో వారు అమెరికాలో ఉపాధి కోసం వస్తూ ఉంటారు.

అలాగే దోపిడీ ముఠాలు కూడా ఎక్కువ మెక్సికో నుంచి అమెరికాలోకి వస్తూ ఉంటాయి. అమెరికాలో గత కొన్నేళ్లుగా మెక్సికో సరిహద్దుల్లో దోపిడీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. కొండా ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని వారు బీభత్సము సృష్టిస్తున్నారు. దీనిపై ఇప్పుడు అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అమెరికన్లను మోసం చేసారని, మెక్సికోలో కనీసం కీలక ప్రాంతాల్లో కూడా గోడ కట్టలేకపోయారని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. ఇక మెక్సికో గోడ అనేది సాధ్యం కాదని కానీ దాన్ని ఒక కథలా అల్లి అమెరికన్లకు ట్రంప్ కథలు చెప్పారని ఆరోపిస్తున్నారు. ట్రంప్ గోడ కట్టకపోయినా పర్లేదని… కనీసం వారిని అడ్డుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news