భారత్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

-

భారత్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఆరంభమైన డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2015లో తొలిసారి గులాబీ బంతితో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య డే/నైట్ టెస్టు జరగగా.. ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలోని 8 దేశాలు ఈ డే/నైట్ టెస్టులు ఆడాయి. కానీ.. భారత్, బంగ్లాదేశ్‌ మాత్రం గులాబీ బంతితో ప్లడ్ లైట్ల వెలుగులో టెస్టు ఆడబోతుండటం ఇదే మొదటిసారి.

ఇండోర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. రెండు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆఖరి టెస్టులోనూ గెలిస్తే..? సొంతగడ్డపై వరుసగా 12 టెస్టు సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది.

Read more RELATED
Recommended to you

Latest news