ఉరి తాడుకి అరటి పండు గుజ్జు ఎందుకు పూస్తారు…?

-

నిర్భయ దోషులను ఫిబ్రవరి ఒకటి, అంటే రేపు ఉరి తీయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఉరిపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అసలు శిక్ష అమలు చేస్తారా లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనితో అసలు ఈ ఉరి ఏ విధంగా అమలు చేస్తారు…? ఉరికి ముందు జరిగే ప్రక్రియ ఏంటీ…? తలారి ఎం చేస్తారు…? ఆ తాడు ఏ విధంగా ఉంటుంది…? అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు.

ఈ నేపధ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ఉరి తాడుని ఏ విధంగా సిద్దం చేస్తారో చూద్దాం. ఉరి తాడు నునుపుగా ఉండటంతో పాటుగా బలంగా ఉంటుంది. ఆరు మీటర్ల ఉరి తాడుని అమలు చేయడానికి సిద్దంగా ఉంచుతారు. రెండు రోజుల్నుండి క్రీజ్, అరటి పండు గుజ్జు రాసి నున్నగా మారుస్తారు దాన్ని. అలా ఎందుకు చేస్తారు అంటే… ఉరి తీయబడే వ్యక్తికి గాయం కాకుండా…

గొంతువరకు తగిల్చి ఉచ్చుని వదులు కాకుండా కొంచెం గట్టిగా బిగిస్తారు. ఇలా చేయకపోతే తాడు రాపిడికి మెడ వరుచుకుని గాయమవుతుంది. ఇక ఉరి తీసే దగ్గరే ఒక డాక్టర్, ఒక లాయరు, జైల్‌ సూపరింటెండెంట్‌ ఉంటారు. ఆ వ్యక్తికి తెల్లబట్టలు వేసి తీసుకొస్తారు. అలాగే అతని మొహానికి నల్ల గుడ్డ కప్పుతారు. సరిగా 15 నిమిషాల పాటు ఉరి తీస్తారు. ఆ వ్యక్తి మరణించాడా లేదా అని తెలియడానికి డాక్టర్ వచ్చి అతని నాడి చూస్తాడు.

ఇక ఉరి వేసే గదిలో 60 క్యాండిల్ బలుబు మాత్రమే వెలుగుతుంది. అంతా చీకటిగా ఉంచుతారు. ఇక అక్కడ ఉన్నతాధికారులు మినహా ఎవరూ ఉండరు. ఉరి వేసే ముందు అతనికి ఆరోగ్య పరిక్షలు చేస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే ఉరి శిక్ష అమలు జరుగుతుంది. లేకపోతే ఉరి తీసే అవకాశం ఉండదు. ఇక వాళ్లకు ఏమైనా గాయాలు ఉన్నా సరే ఉరి శిక్ష తగ్గే వరకు అమలు చేయరు.

Read more RELATED
Recommended to you

Latest news