వాటర్ బాటిల్ కు ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు..నీటికి కూడా గడువుందా.?

-

మార్కెట్ లో అమ్మే ప్రతిదానికి ఎక్స్‌పైరీ డేట్ వేస్తారు. మనం కూడా దాన్ని బట్టే తీసుకుంటుంటాం.. కానీ కొన్ని వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ అవసరం లేకపోయినా వేస్తారు.. ఎందుకు అలా..కాటన్ కి, వాటర్ బాటిల్ కూడా వేస్తారు. నీటికి కాలపరిమితి ఉంటుందా..? అయినా వాటర్ బాటిల్ మీద ఎక్స్‌పైరీ డేట్ వేస్తారు.. ఈరోజు ఎందుకు అలా వేస్తారో చూద్దామా..!

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నీటి బాటిళ్లపై గడువు తేదీని రాయడాన్ని తప్పనిసరి చేయలేదు. లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం.. నీరు ఎప్పుడూ చెడిపోదు. కానీ గడువు తేదీ ప్లాస్టిక్‌ కు వేస్తారు. నీటిని నిల్వ చేసేందుకు ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తారు. ఒక నిర్దిష్ట సమయం తర్వాత, ప్లాస్టిక్ నీటిలో కరగడం మొదలవుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని చాలా సంవత్సరాలు ఉంచడం వల్ల నీటి రుచి దెబ్బతింటుంది. సాధారణంగా బాటిళ్లపై తయారీ తేదీ నుంచి 2 సంవత్సరాల గడువు తేదీ రాస్తారు. ఈ గడువులోపే వాటర్ ను ఉపయోగించాలి.

ప్లాస్టిక్ వల్ల మనకు ఎంత అనర్థాలు జరుగుతాయో తెలిసిందే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ ప్రకారం.. చాలా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో BPA అనే​రసాయనం ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మాయో క్లినిక్ ప్రకారం.. BPA రక్తపోటు, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నీటిని నిల్వ చేయడానికి, విక్రయించడానికి మార్కెట్ లో.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తారు. ఈ సీసాలు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఈ బాటిళ్లను ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల… ప్లాస్టిక్ శరీరంలో కరిగిపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

సో..మొత్తానికి మ్యాటర్ ఏంటంటే.. ఎక్స్‌పైరీ డేట్ అనేది.. వాటర్ కి కాదు.. బాటిల్ కి వేస్తారు. ఏది ఏమైనా.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగడం అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు తప్పుదు అంటే అప్పుడు తాగొచ్చు ఏమో కానీ.. డైలీ ఇంట్లో తాగే నీళ్లకు ప్లాస్టిక్ వాడకంను మానేయడమే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news