స్కీములు స్కాములు.. తెలిసినా మోసపోవడానికి కారణాలేంటి?

-

ఏదో ఒక స్కీము పేరు చెప్పి ఆర్థికంగా నష్టం చేసేవాళ్ళు మీ చుట్టూరా ఉంటారు. కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అలా చేస్తారని మీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా మోసపోతూనే ఉంటారు. ఎంతో కష్టపడి భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు మొత్తం స్వాహా అయిపోతుంది. అంతా అయిపోయాక బాధపడడం తప్ప చేసేదేమీ ఉండదు. అసలు ఈ ఆర్థిక మోసాలకి గురవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

డబ్బులు
డబ్బులు

చిన్న సాయాలు

మోసం చేయాలనుకునే వారు ముందుగా మీకేదైనా చిన్నపాటి సాయం చేస్తారు. దానివల్ల తామేదో పెద్ద సాయం చేసినట్లుగా మీరు ఫీలవ్వాలని అనుకుంటారు. కొన్ని సార్లు అలా ఫీలవుతారు కూడా. అప్పుడే అవతలి వారికి సాయం చేసి రుణం తీర్చేసుకుందాం అనుకుంటారు. అదే మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది.

ఇతరులను ఫాలో అవడం

సాధారణంగా ఈ స్కీముల్లో మోసపోయేవారు ఇతరులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాను అన్న ఆశతో వస్తారు. సైకాలజీ ప్రకారం మనుషులు ఎక్కువ మంది ఎటు వైపుంటే అటు వైపు మొగ్గడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకు లేని నొప్పి నాకొక్కడికే వచ్చిందా అని చేతులు కాల్చుకుంటారు.

అపజయం తాలూకు భయం

మోసం చేసేవాళ్ళ ఎత్తుగడలు క్రూరంగా ఉంటాయి. మీ కుటుంబం కోసం చేపడుతున్న ఈ స్కీముకి మధ్యలో ఆపివేస్తే కుటుంబానికి నష్టం చేకూరుస్తున్నారన్న నిరాశని కలగజేస్తారు. ఆ సెంటిమెంటుకి చాలా మంది పడిపోతారు. మీరు అందులో ఉండకండి.

మిస్ అవుతానేమో?

ఈ ప్రశ్న ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. ఏమో ఈ స్కీములో అందరూ లాభపడితే నేనొక్కడినే మిస్ అవుతానేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనే మోసపోవడానికి మూలకారణంగా నిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news