మనం బతికేదే నమ్మకం మీద. ఆ నమ్మకం ఉంటేనే ఎవరైనా బతికేది. నమ్మకం లేని చోటు జీవితమే ఉండదు. తల్లిదండ్రులు తమ పిల్లల మీద నమ్మకంతో బతుకుతారు. భార్యాభర్తల బంధం కూడా నమ్మకంతోనే నడుస్తుంది. నమ్మకమే లేకపోతే భార్యాభర్తల బంధం సవ్యంగా కొనసాగుతుందా? ఇప్పుడు శబరిమలపై జరిగే చర్చ కూడా అలాంటిదే. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించకూడదు అనే నియమం ఇప్పటిదా? కాదు కదా. వందల ఏళ్ల నుంచి ఉన్న నియమం అది. అది ఓ నమ్మకం. ఆ నమ్మకాన్ని, నియమాన్ని ఇప్పుడు తుంగలో తొక్కి ఆలయానికి వెళ్తాము అంటూ మొండి పట్టు పట్టుక్కూర్చుంటే ఏం లాభం. శబరిమల ఆలయానికి ఓ చరిత్ర ఉంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం.. మహిళలు ఆలయంలోకి రావద్దు అన్నప్పుడు.. మహిళలు అవేమీ పట్టించుకోకుండా వెళ్లడం దేనికి సంకేతం.
అసలు మహిళలు శబరిమల ఆలయంలోకి ఎందుకు వెళ్లకూడదు. వాళ్లకు ఎందుకు నిషేధం. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఇంత కఠినంగా నిర్ణయాలు ఎందుకు ఉన్నాయి. అయ్యప్ప దీక్షల నియమాలు తెలిసినవాళ్లు, అయ్యప్ప భక్తులు, అర్చకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పును కూడా పక్కనబెట్టి మహిళలను ఆలయంలోకి ఎందుకు అనుమతించడం లేదు.. వీటన్నింటికి సమాధానాలు ఈ వీడియో.