గుమ్మడి గింజలను లైట్ తీసుకోవద్దు… ఉపయోగాలు తెలిస్తే…!

-

గుమ్మడి గింజలను లైట్ తీసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. వాటి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా కూరగాయాల్లో వచ్చే గింజలను ఎక్కువగా చాలా మంది తీసేస్తూ ఉంటారు. అవి రుచిగా లేవని, లేక వాటిని తినలేకపోతున్నామని అంటూ ఉంటారు. కాకరకాయ తింటే అవి చేదుగా ఉన్నాయని గింజలు పాడేస్తూ ఉంటారు. కానీ వాటి వలన చాలా ఉపయోగాలు ఉంటాయని, వాటిల్లో ఉండే ఒకరకమైన బ్యాక్తీరియా వంటివి కడుపులో శుద్ధి జరగడానికి ఉపకరిస్తాయని వైద్యులు అంటున్నారు.

ఇక ఆర కాకరకాయలో గింజలు కూడా కొన్ని సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతున్నాయి. ఇక ప్రకృతిలో దొరికే కొన్ని కొన్ని వాటి వలన ఉపయోగాలు తెలియక పక్కన పెడుతూ ఉంటారు. తాజాగా గుమ్మడి గింజల విషయంలో వైద్యులు చెప్పినవి తెలిస్తే… వాటిని పక్కన పెట్టకుండా ఉండటమే మంచిది అంటున్నారు పలువురు. గుమ్మడి గింజ ల్లో జింక్, మెగ్నీషయం ఎక్కువగా ఉంటాయట. అదే విధంగా ఇవి రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహకరిస్తుందట. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా గుండెకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందట.

అంతే కాకుండా… వీటిలో ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. ఈ గింజల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందట. తద్వారా గుండె పని తీరు మెరుగుపడుతుందని అంటున్నారు. రకాన్ని శుద్ది చేస్తాయని సూచిస్తున్నారు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా గుమ్మడి గింజలు నిరోధిస్తాయని అంటున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుందని అంటున్నారు.. ఆడవారికి మోనోపాజ్ దశలో వచ్చే సమస్యలకు మంచి నివారణ అని అంటున్నారు. మగవారిలో వీర్యం నాణ్యత పెరుగుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news