రైతా..మజకా.. దెబ్బకు అధికారులు దిగొచ్చారు..

-

రైతులు పంట పండించడం మాత్రమే కాదు..ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు మానరు..వాళ్ళకు వెన్ను దైర్యం, గుండె ధైర్యం ఎక్కువ..ఇప్పుడు ఓ రైతు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు..తన ఇంటికి ఎందుకు కరెంట్ ఇవ్వలేదు..నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటూ ఏకంగా ఆఫీస్ కు వెళ్ళి మరి నిరసనతెలిపారు. తన రోజువారీ అవసరాలకు కరెంట్ కావాలని డిమాండ్ చేశారు..మొత్తానికి అనుకున్నది సాధించాడు..

వివరాల్లొకి వెళితే..కర్ణాటకకు చెందిన ఒక రైతు మసాలు రుబ్బుకోవడానికి, ఫోన్‌ రీఛార్జ్‌ చేసుకోవడానికి తదితర పనులన్నింటికీ నేరుగా తన ఇంటికి సమీపంలోని విద్యుత్‌ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఇలా అతను పదినెలలుగా చేస్తున్నప్పటికీ అక్కడ అధికారులు నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవడం విచిత్రం. అసలేం జరిగిందంటే… హనుమంతప్ప అనే రైతు ఇంటికి 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. మిగతా సమయం మాత్రం చీకటిలో గడపాలి..

ఈ విషయం పై అతను ఏకంగా ఆఫిసుకు వెళ్ళి మరి ఆందోళనకు దిగారు.వాళ్ళు పట్టించుకోక పోవడంతో ఎలాగైనా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. దాంతో రైతు తన వ్యక్తిగత పనుల కోసం విద్యుత్‌కార్యాలయాన్నే వాడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయంలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అ‍వ్వడంతో విద్యుత్‌ శాఖ రైతు వ్యక్తిగత పనులకు విద్యుత్‌ కార్యాలయాన్ని వాడుకునేందుకు అనుమతిచ్చిన సదరు ఉద్యోగులకు నోటీసులు పంపించింది.

అంతేకాదు మెస్కామ్ జూనియర్ ఇంజనీర్ విశ్వనాథ్ భారీ వర్షాల కారణంగా ఐపీ సెట్‌లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని, అందువల్లే ఆ రైతు ఇంటికి విద్యుత్‌ సరఫరా కావడం లేదని చెప్పారు. ఐతే ఆ రైతుకి మల్లాపుర పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ లైన్ తీసి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు అని చెప్పారు. అలాగే ఆ రైతు ఇంటికి నెల రోజుల్లో కరెంట్ ఎలాగైనా వస్తుందని విద్యుత్ అధికారులు భరోసా ఇవ్వడంతో కూల్ అయ్యాడు..ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో రకరకాల కామెంట్లను అందుకుంటున్నాడు..

Read more RELATED
Recommended to you

Latest news