ల్యాప్‌టాప్‌ ఛార్జ్‌ చేయడానికి కరెంట్ అవసరం లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..!!

-

కరెంట్ ను ఎక్కువగా వినియోగించుకొనే వాటిలో మొబైల్, ల్యాప్ టాప్ లు ఉన్నాయి.. చాలామంది వీటిని పట్టించుకోరు కానీ వీటివల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువగానే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ చింతవద్దు. ఛార్జింగ్‌ కోసం విద్యుత్ అవసరం ఉండదు. ఎందుకంటే మార్కెట్‌ లోకి సోలార్‌ పవర్‌ బ్యాంక్‌ వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఆ పవర్ బ్యాంక్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


మార్కెట్‌ లో అనేక విద్యుత్ ఛార్జ్ పవర్ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. అయితే కరెంటు లేకుండా మొబైల్స్, ల్యాప్‌ టాప్‌లను త్వరగా ఛార్జ్ చేసే సోలార్ పవర్ బ్యాంక్ కూడా వచ్చేసింది. ధర కూడా 2 వేల లోపే ఉంది. ఇది చూడటానికి సాధారణ పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది… ఇది సూర్యని వేడిని గ్రహిస్తుంది..

సోలార్ ప్యానెల్‌ ల ను కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్‌ ఫోన్‌లు, టాబ్లెట్‌ లు, ల్యాప్‌ టాప్‌లకి అవసరమయ్యే విద్యుత్‌ని సేకరించుకుంటుంది. తర్వాత దీనిని ఛార్జింగ్‌ కోసం ఉపయోగించు కోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ సాధారణ పవర్ బ్యాంక్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది స్థానిక మార్కెట్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇది చాలా తక్కువ ధర తో అందరికి అందుబాటులో ఉంటుందని గమనించండి.. త్వరపడండి..

Read more RELATED
Recommended to you

Latest news