మనం చేపలు కూర వండుకోవాలంటే.. ఏం చేస్తాం.. మార్కెట్ కు పోయి.. చేపలు తెచ్చుకుని.. వాటిని నీటిగా బండుకు వేసి రుద్ది.. బాగా మసాలులు పట్టించి గుమగుమలాడేట్లు వండుకుని తింటాం.. అంతేకానీ.. చేపల కూర వండుతున్నాం అని అధికారుల దగ్గరకు పోయి లైసెన్స్ తెచ్చుకుని, ఎన్నో షరతులకు ఒప్పుకుని అప్పుడు వండుకోవాలంటే..ఇమాజిన్.. అసలు ఇలా ఉంటుందా అనుకుంటున్నారా.. కానీ ఆ చేపను వండాలంటే.. ఇలానే చేయలండీ..! ఇంతకీ ఆ చేప ఏంటి, ఎందుకు అంత నిబంధనలు పెట్టారో చూసేద్దాం..!
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్పలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు మనిషి ముఖాన్ని పోలిన వెరైటీ బెలూన్ చేప(Balloon Fish) చిక్కింది. అయితే దాని గురించి మరికొన్ని వింత విశేషాలు తెలిశాయి. ప్రపంచంలోనే రెండో విషపూరితమైన ఈ బెలూన్ చేపను.. కర్రీ చేయాలంటే మాములు చెఫ్ లు సరిపోరూ.. కనీసం పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలని నిఫుణులు చెబుతున్నారు.
ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరమట.. దీన్ని జపాన్ లో ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’ అని కూడా పిలుస్తారు. ఈ చేపను.. జపాన్‌లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో ఎక్కువగా వండుకుని తింటారని అధికారులు అంటున్నారు.
జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారట. నీళ్లలో ఈదే ఈ చేపనుగానీ పట్టుకుంటే.. . ప్రమాదం పొంచి ఉందని తెలిసుకుని… ఊసరవెళ్లిలా రూపాలు మారుస్తుందట. ఒక్కసారిగా బంతిలా ఉబ్బుతుంది. నీటిలో ఉన్నప్పుడు తనకేదైనా ప్రమాదకరమైన సంకేతాలు ఎదురైతే.. ఇది తన నార్మల్ కండీషన్లోంచి అబ్ నార్మల్ గా తయారవుతుంది. ఇదే మిగతా చేపలకూ దీనికీ ఉన్న తేడా.
ఇంకా చేపలో హైలెట్ ఏందంటే..తనకు అవసరమైనపుడు గాలి పీల్చుకుని బెలూన్ లా కూడా ఉబ్బగలదు. మిగిలిన చేపలకు ఆ ఫెసిలిటీ లేదు. దీని విషం మనిషిని చంపేంత ప్రమాదకరంగా ఉంటుందట.