డబ్బెలా ఖర్చుపెట్టాలో తెలియకపోతే ఎలా పొదుపు చేయాలో తెలుసుకోలేరు..

-

డబ్బు.. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డబ్బున్న వారికే ప్రపంచం గౌరవం ఇస్తుంది. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ గురించి మాట్లాడుకోవడమే మానేస్తుంది. ఎంత ఎక్కువ డబ్బుంటే అంత ఎక్కువ మంది నీ గురించి మాట్లాడుకుంటారు. ఐతే డబ్బే జీవితం అవ్వాల్సిన పనిలేదు. కానీ జీవితంలో బ్రతకడానికి డబ్బు కావాలి. డబ్బెంత కావాలి అనే దానికి ఒక అంతు లేకుండా పోయింది. ఎంత కావాల్సి వస్తే అంత. ఇంతే చాలు అని ఎవ్వరూ చెప్పలేరు. అదంతా పక్కన పెడితే డబ్బు సంపాదించేవాళ్ళు, సంపాదించాలనుకునేవారు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి.

ఎలాంటి విషయాల్లో డబ్బు ఖర్చుపెట్టాలి. ఎలాంటి విషయాల్లో డబ్బు ఆదా చేయాలనేది తెలుసుకుంటే జీవితంలో ముందుకి వెళ్ళవచ్చు. దానివల్ల డబ్బు వల్ల వచ్చే సమస్యలకి దూరం కావచ్చు. చాలా మంది సమస్యలకి కారణం డబ్బు లేకపోవడమే కాదు. ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలనేది తెలియకపోవడం. ఈ రోజు ఆ విషయాలు తెలుసుకుందాం.

కార్లు, ఖరీదైన బట్టలు కొనడానికి డబ్బు ఖర్చు పెట్టకండి. మీ డబ్బు ఎక్కడ పెడితే అది డబ్బుని సంపాదిస్తుందో తెలుసుకోండి. రియల్ ఎస్టేట్, స్టాక్స్, ఇన్వెస్ట్ మెంట్స్ వాటిల్లో మీ డబ్బు డబ్బుని సంపాదిస్తుంది. కానీ ఇవన్నీ చాలా రిస్క్ తో కూడుకున్నవి. అంత ఈజీగా డబ్బు రాకపోవచ్చు. సో డబ్బు ఖర్చుపెట్టేముందు జాగ్రత్త.

మీకు అర్థం కాని విషయాల్లో డబ్బుని ఇన్వెస్ట్ చేయవద్దు. మీ స్నేహితులు పెడుతున్నారని చెప్పి, మీకేమీ తెలియకపోయినా డబ్బులు ఇన్వెస్ట్ చేయవద్దు.

డబ్బులు పొదుపు చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించలేరు. డబ్బుతో డబ్బుని సంపాదించాలంటే మరీ పిసినారిలా ప్రవర్తించవద్దు.

ఖరీదైన కార్లలో తిరిగే వారు మనం అనుకున్నంత ధనవంతులు కాకపోవచ్చు. అలాగే చాలా సింపుల్ గా కనిపించే వారు పేదవాళ్ళు కాకపోవచ్చు. మీరెలాంటి వారో నిర్ణయించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news