బాధల్ని వదిలేసి బాధ్యతని గుర్తుచేసుకుంటే గెలుపెప్పుడూ నీవైపే అని చెప్పే కథ..

-

ఒకానొక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక గాడిద ఉండేది. ఒక రోజు ఆ గాడిద బావిలో పడిపోయింది. రైతు దాన్ని వెతుక్కుంటూ బావి వద్దకి చేరుకుంటాడు. బావిలో పడ్డ గాడిదని చూసి, ఇలా అయ్యిందేమిటీ అని అనుకుని, ఫర్లేదులే గాడిద ఎలాగూ ముసలిది అయిపోయింది. ఇప్పుడు దాన్ని కాపాడినా పెద్దగా ప్రయోజం ఉండదు అనుకుని బావిని పూడ్చడానికి నిర్ణయం తీసుకుని చుట్టు పక్కల వారందరినీ పిలిచి బావిని పూడ్చేద్దాం అని చెప్తాడు.

యజమాని రాగానే కాపాడతాడనుకున్న గాడిద, తన మీద పారతో మట్టివేయడం చూసి షాకవుతుంది. అసలేం జరుగుతుందో అర్థం కాకుండా అయిపోతుంది. కొద్ది సేపటికి అంతా అర్థమై బాధపడుతుంది. కానీ ఇది బాధపడే సమయం కాదని, ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలని ఆలోచించి, మట్టివేస్తున్న వారిని చూసి, తన మీద పడుతున్న మట్టిని దులిపేసుకుంటూ ఉండసాగింది. అలా మట్టి పడుతున్న కొద్ది దులిపేసుకుని దాన్ని ఒక మెట్టులాగా తయారు చేసుకుని మీదకి ఎక్కసాగింది.

పై నుండి బావిలోకి మట్టిపోస్తున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నా అదేమీ పట్టించుకోకుండా, మట్టిని దులిపేసుకుంటూ పైపైకి రాసాగింది. చివరికి బావి అంచుకు వచ్చి నేలమీదకి వచ్చేసింది. అప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వారి నోర్లు అలా ఆశ్చర్యంలో ఉండగానే గాడిద అక్కడి నుండి వెళ్ళిపోయింది. బాధల్లో ఉన్నప్పుడు బాధపడడం కంటే పట్టుదలగా ఉంటే ఎలాంటి బాధలైనా ఇట్టే తొలగిపోతాయని చెప్పే ఈ కథ ద్వారా ఎంతో తెలుసుకోవచ్చు.

చాలా మంది బాధలున్నాయని బాధపడుతూ కూర్చుంటారు. కానీ అందులో నుండి బయటకి రారు. డేర్ టూ మోటివేషన్ లో వచ్చిన వీడియో ఆధారంగా..

Read more RELATED
Recommended to you

Latest news