యుట్యూబ్ వీడియో ప్రాణాలు కాపాడింది…!

-

సోషల్ మీడియా మనకు ఎన్నో రకాలుగా సహకరిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉంటుంది సోషల్ మీడియా. ఇక సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు సహా అనేక సలహాలు జీవితాన్ని కాపాడుకోవడానికి కూడా సహకరిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే జరిగింది. తన బంధువు కష్టాల్ల్లో ఉండటాన్ని చూసిన ఒక బాలుడు చాక చక్యంగా ప్రాణాలు కాపాడాడు.

వివరాల్లోకి వెళితే అమెరికాలో ఒక 9 ఏళ్ళ బాలుడు తన బంధువుతో కలిసి టేనస్సీలోని మెక్‌నైరీ కౌంటీలో ఒక రోడియోని సందర్శించడానికి వెళ్ళాడు. ఇదే సమయంలో తన బంధువు మీద దాడి జరిగింది. దీనితో వెంటనే అతను చాక చక్యంగా గతంలో యుట్యూబ్ లో చూసిన ఒక టెక్నిక్ ని ప్రయోగించాడు. పాదాల మీద బలంగా కొట్టడంతో పాటుగా అతని మెడ కూడా పట్టుకోవడంతో తన బంధువు ప్రాణాలను కాపాడాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఇదే సమయంలో ఆ పిల్లాడికి అతని తల్లి కూడా సహకరించింది. తన స్కూల్ లో తాను చూసిన ఒక పోస్టర్ అతనికి ఉపయోగపడింది. ఇక దీనిపై యుట్యూబ్ ఛానల్ యాజమాన్యం కూడా స్పందించింది. యుట్యూబ్ జీవితాలను కాపాడటానికి ఎంతగానో సహకరిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం బాలుడి తీరుపై సోషల్ మీడియా హర్షం వ్యక్తం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news