కరోనా అనే సూక్ష్మజీవి మన జీవితాలని పూర్తిగా మార్చివేసింది. అప్పటి వరకూ మన గొడవలో మనం బ్రతుకుతుంటే సముద్రం ఉప్పొంగినట్టు, వరదలకి ఆనకట్ట కూలిపోయినట్టు పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. నెలన్నర పాటు పూర్తిగా ఇంటిపట్టునే ఉన్నాం. ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిగా మునుపటి స్థితికి రాలేకపోయాం. ఎప్పుడు వస్తామో తెలియదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. ఐతే ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉంటూ డైలీ లైఫ్ రొటీన్ లేకుండా, సరైన దినచర్య పాటించకుండా ఉన్నప్పుడు అధిక అలసత్వం వస్తుంటుంది.
ఒంటరితనం, స్వేఛ్ఛ లేకపోవడం, ఇతరులని కలిసే వెసులుబాటు లేకపోవడం, సమాజంతో డిస్ కనెక్ట్ కాబడ్డట్టు ఇంట్లోనే గడపడం మొదలగునవి మానసిక ఒత్తిళ్ళకి దారితీస్తూ అధిక అలసత్వాన్ని కలిగిస్తాయి. ఈ అలసత్వం అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఈ అలసత్వం అటు శారీరకంగానూ, మానసికంగానూ వ్యక్తమవుతూ ఉంటుంది. లక్షణాలని గమనిస్తే,
మామూలు అలసట నుండి తీవ్రంగా అలసిపోవడం..
చిరాకు
అందోళన
అధిక నిద్ర లేదా అసలు నిద్రలేకపోవడం
బద్దకం, నిరాశ..
తీవ్రమైన ఒంటరితనం.. మొదలగునవి..
ఐతే ఈ అలసత్వం నుండి బయటపడడానికి మార్గలున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా చక్కబడితే ఈ అలసట పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పరిస్థితులు నార్మల్ కి రావాలంటే ఎంత టైమ్ పడుతుందో తెలియదు. అందువల మనకు మనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ అలసట నుండి బయటపడవచ్చు..
ఎక్కువ సేపు ఒంటరిగా ఉండకుండా మీలో కనిపిస్తున్న మార్పులని ఇతరులతో పంచుకోండి.
ఇంటిని అందంగా తీర్చి దిద్దడం, తోటపని చేయడం ద్వారా కొంత ఫలితం ఉంటుంది.
యోగా,ధ్యానం ఎక్సర్ సైజ్ మరిచిపోవద్దు.
మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకునే కొత్త డైలీ రొటీన్ ని తయారు చేసుకోండి.
నిరాశని దరిచేరనివ్వకుండా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి.
మీ ఆలోచనలని డైవర్ట్ చేసే ఫోన్ తదితర సాధనాలని పక్కన పెట్టి మీలో మీరు పరిశీలించుకోండి..
ఇలాంటివి చేయడం ద్వారా అధిక విశ్రాంతి ద్వారా వచ్చిన అధిక అలసత్వం నుండి బయటపడగలం.