స్మార్ట్ ఫోన్ కొంటున్నారా…? ఈ విషయం గుర్తుపెట్టుకోండి…!

-

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మన అవసరాలు కూడా ఎక్కువగా దానితోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి కొనుక్కోవడంలో తప్పు లేదు. అయితే కొంత మందికి అది ఒక ప్రతిష్ట గా మారడమే అసలు సమస్య వచ్చింది. స్మార్ట్ ఫోన్ ధర ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రతిష్ట, పరువు, హోదా ఉన్నట్టు నేటి యువత భావిస్తుంది. ఇందుకోసం అప్పులు చేస్తున్నారు. కొంత మంది క్రెడిట్ కార్డుల ద్వారా వాటిని కొనుగోలు చేసి నెల నెలా వాయిదాలు కట్టుకుంటున్నారు.

కాని కొన్ని విషయాలు మాత్రం గుర్తుంచుకోండి. భవిష్యత్తు అనేది ఆర్ధిక జీవనంలో చాలా ముఖ్యం. గతంలో మాదిరిగా పరిస్థితులు లేవు అనేది వాస్తవం. ప్రతీ ఒక్కటి ధరలు పెరుగుతున్నాయి. డబ్బున్న వాడు కొనుగోలు చేస్తున్నాడు అంటే భరించే స్తోమత, భవిష్యత్తులో ఇబ్బందులు లేవని అర్ధం. కాని జీతం వస్తే మినహా పూట గడవని వాళ్ళు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏ స్మార్ట్ ఫోన్ అయినా ఒకటే. అవే ఫీచర్లు, అవే సదుపాయాలు ఈ రోజుల్లో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి.

మహా కొనుక్కుంటే 20 నుంచి 30 వేలకు మించి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల యువత కొనుక్కోకపోవడమే మంచిది. దాని బదులు ఏదైనా పాలసి కొనుగోలు చేసినా, బ్యాంకు లో వేసుకున్నా ఎంతో కొంత ఆదాయం అయినా వస్తుంది గాని ఈ విధంగా స్మార్ట్ ఫోన్ లకు డబ్బులు వృధా చేస్తే మాత్రం భవిష్యత్తులో డబ్బులు లేక గతాన్ని తలుచుకుని బాధపడాల్సి ఉంటుంది. కోరికలు అనేవి మనం అదుపు చేసుకుంటే చచ్చిపోతాయి. నువ్వు స్థిరపడిన తర్వాత కొనుగోలు చేయి గాని ఈ విధంగా డబ్బులను వృధా చేసుకుంటే, ఫోన్ లో నీ హోదా చూసిన వాడు నిన్ను ఎప్పటికి ఆదుకునే అవకాశం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news