శృంగారం చేసిన వెంటనే చెయ్యకూడని పనేంటో తెలిస్తే జీవితంలో అలా చెయ్యరు..?

-

శృంగారం అనేది ఒక ప్రకృతి చర్య.. ఆలు మగల మధ్య మంచి బందాన్ని తీసుకొస్తుంది.. దాంపత్య జీవితం బలంగా మారుతుంది..అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వారానికి కనీసం ఓసారి శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని రోగాలు రాకుండా ఉంటాయని వైద్యులే సూచిస్తున్నారు.. శృంగారం కూడా అత్యవసర కార్యంగానే పరిగణించబడుతోంది. శృంగారంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. ఇంకా అనేక రకాల సమస్యలకు శృంగారం దివ్య ఔషధంగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ శృంగారం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి..

అయితే, లైంగికంగా పాల్గొన్న ప్రతిసారి అవయవాలను శుభ్రంగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. పరిశుభ్రతతోనే శృంగారంలో సమస్యలు రాకుండా ఉంటాయనేది నిజం..శృంగారం తరువాత వాటిని కడుక్కుంటే సురక్షితంగా ఉంటుంది. అంతేకాని శృంగారంలో పాల్గొన్నాక జననాంగాలు కడుక్కోకపోతే వాసన వస్తాయి. ఇతర రోగాలు కూడా చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. మన జననాంగాలను నీటితో సున్నితంగా కడుక్కుంటే చాలు. ఇతర రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం అంత మంచిది కాదు. శృంగారంలో పాల్గొన్న తరువాత మన శరీరంలో ఇతర ద్రవాలు కూడా విడుదల అవుతాయి. గోరువెచ్చని నీటితో కాని సబ్బుతో కాని స్నానం చేయడం సురక్షితం.. ఏదైనా ఉన్నా వేడి నీటికి తొలగిపోతాయి..

ఇకపోతే శృంగారం తరువాత మూత్రాశయాన్ని ఖాళీ చేసుకోవాలి. మూత్రవిసర్జన చేయాలి. యోనిని నీళ్లతో కడిగితే మంచిది. శృంగారం తరువాత క్రిములు లోపలకు వెళ్లకుండా నియంత్రించే క్రమంలో మనం అప్రమత్తంగా ఉంటే సరి. భాగస్వామి క్రిములు మనలో ప్రవేశించే అవకాశాలు ఉన్నందున జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం శ్రేయస్కరం. సంభోగంలో పాల్గొన్న ప్రతి సారి కండోమ్ లను మార్చండి. ఎందుకంటే ఒకటే కండోమ్ ప్రతిసారి వాడటం అంత మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.. అందుకే శృంగారం అయ్యాక కడుక్కోవడం, మూత్రన్ని బయటకు వదలాలి.. ఇది గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది.. సబ్బు, కెమికల్స్ తో మీ ప్రైవేట్ భాగాలను అస్సలు కడగకూడదు..

Read more RELATED
Recommended to you

Latest news