భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించాలంటే ఇలా చెయ్యాలి..

-

భార్యాభర్తల సంబంధం చాలా అద్భుతమైనది..నూరేళ్ళ పాటు విడదీయని బంధం..ఇందులో ప్రేమలు ఉంటాయి. భాధలు,భయాలు కూడా ఉంటాయి.వాటిని సరిగ్గా మేనేజ్ చేయకపోతే వాటి వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.అది శారీరకంగా, మానసికంగా డిస్‌కనెక్ట్ అయిపోతారు. భాగస్వాములు ఇద్దరి మధ్య తిరిగిన కనెక్షన్‌ని నిర్మించడానికి కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే అందుకు కొంత కృషి కూడా చేయాల్సి వస్తుంది.

- Advertisement -

కొందరు భార్యాభర్తలు తీరికలేని పనులు, కుటుంబ బాధ్యతల వల్ల సరిగ్గా మాట్లాడుకోలేరు. దాని వల్ల వారి మధ్య దూరం పెరగడమే కాదు మానసికంగానూ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారికి చక్కని పరిష్కారమే పిల్లో టాక్.పిల్లో టాక్ లో ఐ కాంటాక్ట్ ఉండదు. పిల్లో టాక్ లో ఆలోచించి పదబంధాలు అల్లడం ఉండదు. ఆచితూచి మాట్లాడటం అస్సలే ఉండదు. అంటే ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి పదాలు వాడుతున్నాం అనే సెన్సార్ షిప్ పిల్లో టాక్ లో ఉండదు. ఇది మనసు లోతుల్లో నుండి వస్తుంది. కొంత మందికి పిల్లో టాక్ చాలా సహజంగా వచ్చేస్తుంది. కానీ కొందరు అలా మాట్లాడటానికి చాలా కష్టపడతారు..

ఇకపోతే..మీ భాగస్వామి రిలాక్స్‌గా మరియు హాయిగా ఉన్నప్పుడు సెక్స్‌కు ముందు లేదా తర్వాత మీరు చాలా తరచుగా పిల్లో టాక్ అనుభవిస్తారు. పిల్లో టాక్ యొక్క దృష్టి భాగస్వాములను మరింత దగ్గర చేసే సానుకూల మరియు ఉత్తేజపరిచే కమ్యూనికేషన్‌ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.ఇద్దరు మానసికంగా సురక్షితంగా, అర్థం చేసుకున్నారని మరియు కనెక్ట్ అయినప్పుడు, శృంగారం మరింత ప్రేమగా, మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు..

ఎక్కడేక్కడివో కాకుండా మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి..పడకగదిలో వేరే విషయాలకు బదులు వారి గురించి, వారి బంధం గురించి మాట్లాడుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. పాత జ్ఞాపకాలు, పెళ్లి జరిగిన కొత్తలో అనుభవించిన మధురానుభూతులు, ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు, సరదా సంఘటనలు ఇలాంటివి మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి.అనుమానాలు, చెప్పుడు మాటలు వింటే మాత్రం జీవితం ఆగిపోతుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...