టీమిండియాకు ‘సెలక్టర్‌’ కావలెను..! ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ

-

అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలోని ఇండియా మెన్స్ సెలక్షన్‌ కమిటీలో ఒక సెలక్టర్‌ పదవిని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సెలక్షన్‌ కమిటీలో 5 సభ్యులున్నారు. భారత్ మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్న మెన్స్‌ సెలక్షన్‌ కమిషన్‌ లో శివ సుందర్‌ దాస్ (ఈస్ట్‌ జోన్‌)‌, సలిల్‌ అంకోలా (వెస్ట్‌ జోన్‌), శ్రీధరన్‌ శ్రీరామ్‌ (సౌత్‌ జోన్‌) ,సుబ్రతో బెనర్జీ (సెంట్రల్‌ జోన్‌) లు సభ్యులుగా ఉన్నారు. వెస్ట్‌ జోన్‌ నుంచి సలిల్‌ అంకోలా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఒక్క జోన్‌ నుంచి ఒక్క సెలక్టర్‌ మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది.ప్రస్తుతం చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న అజిత్‌ అగార్కర్‌ సైతం వెస్ట్‌ జోన్‌ నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ ఉండడంతో అంకోలా తన పదవి నుంచి వైదొలగనున్నాడు.

దీంతో అంకోలా స్థానంలో నార్త్‌ జోన్‌ నుంచి ఎవరినైనా తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. సెలక్టర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి.. ఇండియా తరఫున కనీసం 7 టెస్టులు లేదా దేశవాళీలో 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news