ఢిల్లీ vs రాజస్థాన్: వార్నర్ స్పీడ్ పెంచకుంటే… లీగ్ స్టేజ్ లోనే ఇంటికి !

-

ఐపీఎల్ లో ఢిల్లీ ప్రదర్శన మరీ దారుణంగా మారింది. రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ పగ్గాలు అందించిన ఢిల్లీ యాజమాన్యం సరైన పనే చేసినా, వార్నర్ బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా, అతని సామర్ధ్యానికి ఇంకా రాణించాల్సి ఉంది. ఇక కెప్టెన్సీ లోనూ రెండు మ్యాచ్ లు జరిగినా ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఇక బ్యాటింగ్ లో ధనాధన్ ఆటతీరును కనబరిచే వార్నర్ రెండు మ్యాచ్ లలోనూ చాలా స్లో గా పరుగులు చేస్తున్నాడు.

లక్నో మ్యాచ్ లో అర్ద సెంచరీ చేసినా మ్యాచ్ ను గెలిపించడంలో ఫెయిల్ అయ్యాడు. రెండవ మ్యాచ్ లో గుజరాత్ పై 32 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. వార్నర్ ఇకపై బ్యాటింగ్ లో దూకుడు మరియు కెప్టెన్సీ లో పరిణితి కనబర్చకపోతే లీగ్ దశలోనే ఇంటిబాట పట్టే ప్రమాదం ఉంది. మరి ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ తో ఏ విధంగా ఆడుతాడు అన్నది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news