ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి.గత రెండేళ్ళు విద్యార్థులకు సరిగ్గా క్లాసులు జరగలేదు.కేవలం ఆన్ లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి.ఈ ఏడాది సిలబస్ ను తగ్గించి మరీ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ సబ్జెక్టులలో సిలబస్ లను తగ్గించారు. ముఖ్యంగా మ్యాథ్స్ పరీక్షల పై విద్యార్థులు కాస్త టెన్షన్ పడుతున్నారు.. సిలబస్ లో ఎటువంటి అంశాలు ఉంచారు అనేది తెలుసుకోవడం చాలా మంచిది.
సిలబస్ నుంచి తొలగించిన అంశాలు అధ్యయానాల ప్రకారం చూస్తే..
అధ్యాయం-1: ప్రమేయాలు:
1.2. విలోమ ప్రమేయాలు & వాటికి సంబంధించిన సిద్ధాంతాలు
అధ్యాయం -2: గణితానుగమనం:
మొత్తం అధ్యాయం
అధ్యాయం -3: మాత్రికలు:
3.4.8. నిర్ధారకాల ధర్మాలు మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలు, సమస్యలు.
3.6. ఏక కాల రేఖీయ సమీకరణాల సంగతత్వం, అసంగతత్వం
3.7 గాస్ – జోర్డాన్ పద్ధతి
3.7.7 తో పాటు తర్వాత అన్ని
అధ్యాయం-5: సదిశల లబ్దం:
5.11. ఒక తలం యొక్క సదిశా సమీకరణం, వివిధ రూపాలు, అతలీయ రేఖలు (skew lines), అతలీయ రేఖల మధ్య లంబ దూరం, సరళ రేఖలు సతలీయాలు కావడానికి నియమం.
5.12. సదిశా త్రిక లబ్దం మరియు వాటి ఫలితాలు
అధ్యాయం -7: త్రికోణ మితీయ సమీకరణాలు:
మొత్తం అధ్యాయం
అధ్యాయం -8: విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు:మొత్తం అధ్యాయం
అధ్యాయం -9: అతి పరావలయ ప్రమెయాలు:
9.2 విలోమ అతి పరావలయ ప్రమెయాలు మరియు గ్రాఫ్ లు..
పైన తెలిపిన సిలబస్ మ్యాథ్స్ 1 ఎ..
ఇప్పుడు మ్యాథ్స్ 1బి సిలబస్ ను చూద్దాము..
అధ్యాయం -4: సరళ రేఖా యుగ్మాలు:
4.3 సరళ రేఖల మధ్య కోణాల సమద్విఖండన రేఖాయుగ్మం, అభ్యాసం 4(a) మరియు సంబంధిత సమస్యలు
4.5 సమాంతర రేఖలవడానికి నియమాలు, వాటి మధ్య లంబ దూరం, రేఖా యుగ్మ ఖండన బిందువు, అభ్యాసం 4(b)
అధ్యాయం -7: సమతలం :
అభ్యాసం 7(a) సెక్షన్ II & III సంబంధిత సమస్యలు
అధ్యాయం -8: అవధులు, అవిచ్ఛిన్నత:
8.4 అవిచ్చిన్నత
అధ్యాయం -9: అవకలనం :
9.3 విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు అవకలనాలు, అభ్యాసం 9(c) సెక్షన్ III సంబంధిత సమస్యలు, అభ్యాసం 9(d)
అధ్యాయం 10: అవకలజాల అనువర్తనాలు:
10.6 మార్పు రేటు గా అవకలనం
10.7 రోలే సిద్ధాంతం, లెగ్రాంజీ మధ్యమ మూల్య సిద్ధాంతం
10.8 ఆరోహణ, అవరోహణ ప్రమేయాలు
వీటి ప్రకారం మీరు చదువుకుంటే మంచి ఫలితాలను అందుకోవడం తో పాటు సబ్జెక్టులో టాపర్ కూడా అవ్వొచ్చు.. ఆల్ ది బెస్ట్..