వివాదంలో జ‌గ‌న్ : మంత్రి క్లారిఫికేష‌న్ ఇచ్చిండు ఇక నో త‌గాదా

-

రాజ‌కీయంలో ఏమ‌యినా జ‌ర‌గ‌వ‌చ్చు. ఏం జ‌రిగినా చూస్తూ ఉండిపోవ‌డం బాగుంటుంది. మాట్లాడ‌కుండా మౌనంగా ఉండిపోవ‌డంలో అర్థం దాగి ఉంటుంది. కానీ రాక రాక ద‌క్కిన ప‌ద‌వికి కార‌ణం అయిన వ్య‌క్తికి సాష్టాంగ ప‌డ‌డం బాలేదు అని అంటున్నారు సంబంధిత సామాజిక‌వ‌ర్గం పెద్ద‌లు. ఏకంగా ఓ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు సాష్టాంగ ప్రణామం చేసి త‌మ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టార‌ని బాధితులు వేద‌న చెందుతున్నారు.

నిన్న‌మొన్న‌టి వేళ ఉమ్మ‌డి తూగో జిల్లాలో అదేలేండి తూర్పుగోదావ‌రి జిల్లాలో ఓ పెద్ద వివాదం రేగింది. అక్క‌డి లీడ‌ర్ కుడిపూడి చిట్ట‌బ్బాయి ప్రథ‌మ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కొన్ని అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌న‌కు కార‌ణం అయిన మంత్రి చెల్లుబోయిన వేణు పై తిరుగుబాటు చేశారు.

“జాతిని అమ్ముకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. జాతిని నమ్ముకుంటాను తప్ప అమ్ముకోను. మా జాతి నాయకులకు మేలు జరుగుతుందంటే.. వారి కోసం ఎంతవరకైనా పోరాడతా. శెట్టి బలిజ సామాజిక వర్గం ఉన్నతికి కృషి చేస్తున్న నాయకుడు జగన్ గారు..” అని అంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణు.

“కల్లు గీత కార్మికులుగా ఉన్న మేము ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నాం.. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే… అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయించి, మా జాతికి దేశవ్యాప్తంగా గౌరవం, గుర్తింపు కల్పించిన నాయకుడు జగన్ గారు. రెండు రాజ్యసభ స్థానాల్లో… ఒకటి మా శెట్టిబలిజ వర్గానికే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోసు గారికి, రెండోది మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణ గారికి ఇచ్చి వారిని రాజ్యసభకు పంపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిగారికే దక్కుతుంది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్ గారు. బీసీలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు, టీడీపీ నాయకులు మాపై విమర్శలు చేయడం విడ్డూరం” అని అంటున్నారాయ‌న.

Read more RELATED
Recommended to you

Latest news