ప్రభుత్వం అంటే ప్రజల కోసం పని చేయాలి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇంద్రలోకం, చంద్రలోకం అంటూ మాయమాటలు చెబుతారని, ఈ దొర మాటలకు మోసపోతే మళ్లీ తెలంగాణ ప్రజలు గోసపడాల్సి వస్తుందని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, దొర చేతికి అప్పగించడానికి కాదన్నారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పని చేయాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ దొర ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తాడని, మళ్లీ ఎన్నికలు పూర్తి కాగానే ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోడని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు మాయ మాటలు చెబుతాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ponguleti: పొంగులేటి సంచలన కామెంట్స్.. బీఆర్‌ఎస్‌ని భూస్థాపితం చేయాలి |  Ponguleti: Ponguleti sensational comments.. BRS should be grounded ksv

ఇందిరమ్మ రాజ్యంతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. నన్ను గెలిపించాలని, నిత్యం మీతో ఉంటానని… మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ ఇప్పటివరకు ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నాడన్నారు. ఆ దాచుకున్న.. దోచుకున్న సొమ్ముతో అక్కడ రేవంత్ రెడ్డిని, ఇక్కడ తనను ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకు కోట్లాది కూపాయలు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో ప్రజల సొమ్మును కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.కేసీఆర్ ను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలన్నారు. కాంగ్రెస్ వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామన్న పొంగులేటి తనను, రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news