రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలకు ప్రజా ప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 6న విచారణకు హాజరుకావాలని ఇద్దరు నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజయ్, అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్‌సాగర్ వద్ద పీవీ నరసింహారావు, ఎన్‌టీ రామారావు ఘాట్‌లను కూలుస్తామని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించగా.. దారుస్సాలాంలోని ఎంఐఎం కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని సంజయ్ అన్నారని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ విషయమై 2020, నవంబర్‌లో కేసులు నమోదు చేసిన పోలీసులు తాజా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసు విచారణకు స్వీకరించిన ప్రజా ప్రతినిధుల కోర్టు బండి సంజయ్, అక్బరుద్దీన్ ఓవైసీలకు సమన్లు జారీ చేసింది.