మధు యాష్కీ నివాసంలో కాంగ్రెస్ కీలక నేతల భేటీ.. !

తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చైర్మెన్ మధుయాష్కీ నివాసం లో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇంచార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవా లు మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.
ఈ సమావేశానికి తెలంగాణ‌ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రియు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, హర్కల వేణుగోపాల్ రావులు కూడా హాజ‌రయ్యారు.

రేపు రాయచూరులో జరుగునున్న కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనడానికి నేత‌లు హైద‌రాబాద్ నుంచి వెళుతున్న‌ట్టు స‌మాచారం. ఇక నేడు హైద్రాబాద్ పార్క్ హయత్ హోటల్ లో సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, సూర్జేవాలు బ‌స చేయ‌నున్నారు. రేపు ఉదయం నేత‌లంతా రాయచూరుకు బ‌య‌లు దేర‌నున్నారు.