రష్యా దాడిని తిప్పికొట్టిన యుక్రెయిన్… 18 క్షిపణులు ద్వంసం !

-

చాలా కాలంగా రష్యా మరియు యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్దాన్ని ఎలాగైనా ఆపాలని చాలా దేశాలు ప్రయత్నించినప్పటికీ ఎవ్వరి మాటలను రష్యా అధ్యక్షుడు పుతిన్ వినకుండా మూర్ఖంగా యుద్దాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా రష్యా ఉక్రెయిన్ లోని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని భీకరమైన దాడిని కొనసాగించింది. ముఖ్యంగా కీవ్ నగరాన్ని ద్వంసం చేయడానికి 180 క్షిపణలను ఉపయోగించింది. కానీ ఈ క్షిపణుల దాడిని ఉక్రెయిన్ రక్షణ దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది. రష్యా సంధించిన క్షిపణులను గాల్లోనే ద్వంసం చేసి యుక్రెయిన్ సరైన జవాబిచ్చింది.

కానీ రష్యా మాత్రం మేము దాదాపుగా గురి పెట్టిన లక్ష్యాలను చేధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ముందు ముందు ఈ యుద్ధం ఇంకెంత ప్రాణ ఆస్థి నష్టాలను కలిగిస్తాయో చూడాలి. కాగా ఈ యుద్ధం నుండి బయటపడానికి మరియు రష్యాను మరింతగా ఎదిరించడానికి జిలెన్ స్కి ఇటీవల బ్రిటన్ నుండి ఆర్ధిక మరియు సైనిక సహాయం కోరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news