ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జి లను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలలో ఎవరైతే కీలకపాత్ర పోషించారో వారికి మాత్రమే బాధ్యతను అప్పగించింది. ఇంచార్జ్ లుగా నియమించబడిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు దాదాపు అందరూ మంత్రులే ఉన్నారు.
in
ఈ నేపథ్యంలో… ఆదిలాబాద్ నియోజకవర్గానికి మంత్రి సీతక్క, పెద్దపల్లి నియోజకవర్గానికి శ్రీధర్ బాబు, నల్గొండ పార్లమెంట్ ఇంచార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ ఇంఛార్జిగా పొన్నం ప్రభాకర్, భువనగిరి ఇన్చార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి,నిజామాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా జీవన్ రెడ్డి ,జహీరాబాద్ ఇంఛార్జిగా పి.సుదర్శ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. మల్కాజ్గరి పార్లమెంట్ ఇంఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల ఇంఛార్జిగా భట్టి విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్నగర్ స్థానాల పార్లమెంట్ ఇంఛార్జిగా సీఎం రేవంత్రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంఛార్జిగా జూపల్లి కృష్ణారావు, మెదక్ ఇన్చార్జిగా దామోదర్ రాజనర్సింహ,వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జిగా కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం ఇన్చార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను నియమించింది