వావ్: టిప్పు సుల్తాన్ యుద్ధం చేసే ఖడ్గానికి రూ. 140 కోట్లు !

రాజుల కాలంలో యుద్దాలు జరిగేవి, ఈ యుద్ధాలలో అవతలి రాజ్యాలపై గెలవడానికి రకరకాల ఆయుధాలను తయారుచేసుకునేవారు. ముఖ్యంగా రాజులు వాడే ఖడ్గాలు చాలా ఆకర్షణీయంగా మరియు పదునుగా ఉండేలాగా చేసేవారు. ఇప్పుడు మనము అలాంటి కత్తులను చూడాలంటే ఏ మ్యూజియం లోనో చూడాల్సి వస్తోంది. అప్పుడప్పుడు రాజుల కాలంలో వాడిన వస్తువులను పురావస్తు శాఖ అధికారులు వేలం వేస్తుంటారు. ఈ వేళలలో వారే ఊహించని అంతా ధరలకు అమ్ముడుపోతుంటాయి. తాజాగా టిప్పు సుల్తాన్ కాలం నాటి ఖడ్గానికి షాకింగ్ ధర పలకడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ టిప్పు సుల్తాన్ వాడే ఖడ్గాన్ని లండన్ లో వేలం వేయగా అత్యధికంగా ఈ కత్తి రూ. 140 కోట్లకు అమ్ముడుపోయింది.

 

 

 

 

వేలం నిర్వహణ అధికారులు ఊహించిన ధర కంటే ఇది 7 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. టిప్పు సుల్తాన్ వాడిన ఆయుధాలలో ఈ ఖడ్గం చాలా ప్రాముఖ్యం చెందినదిగా తెలుస్తోంది.