తెలంగాణాలో అధికార పార్టీ BRS ను ఓడించడానికి ఒకవైపు కాంగ్రెస్ , మరోవైపు బీజేపీలు బలంగా పనిచేస్తున్నాయి. కాగా కాంగ్రెస్ ఇంతకు ముందులా కాకుండా, రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజలలో విశ్వాసాన్ని కూడగట్టుకుని త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పైన చేసిన వ్యాఖ్యలను BRS తప్పుగా మాట్లాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క క్లారిటీ ఇచ్చింది. ఈమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే రైతులను అభివృద్ధి చేయడం. అందుకే వ్యవసాయంలో కీలకంగా మారే విద్యుత్తును మొదటగా ఉచితంగా అందించింది మా ప్రభుత్వమే అని గతాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి మరియు BRS నేతలకు గుర్తు చేసింది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా అనవసరంగా రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తోందని సీతక్క మండిపడ్డారు.
ఇప్పుడు తెలంగాణ విద్యుత్తు సంస్థలను రూ. 60 వేల కోట్ల రూపాయల్లో ముంచి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ గా బదులిచ్చింది సీతక్క.