తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం మరింత వెడెక్కుతుంది. ఎన్నికల్లో తెరాస ఓడితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా నంటూ… కేటీఆర్ ప్రెస్ క్లబ్ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గురువారం మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ… 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటూ చెప్పుకుంటున్న నాయకులు సైతం నోరు వెళ్లబెట్టేలా తెలంగాణ అభివృద్ధిపథంలో పరుగులెడుతుందన్నారు. ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా రంగులు మార్చుతున్న చంద్రబాబుని తెలంగాణలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
బాబు..స్వయంప్రకాశం లేని చంద్రుడు అంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీనైతే బంగాళాఖాతంలో కలిపేయాలనే ఎన్టీఆర్ ఆశించారో.. అదే పార్టీతో ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుందని కేటీఆర్ అన్నారు. డిసెంబరు 11 ఫలితాల తర్వాత తెరాస అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారుడిగానూ…పాలనాదక్షకుడిగా నిరూపించుకున్నారని కేటీఆర్ అన్నారు.