వాట్ ఏ టైమింగ్ బాసు.. అదృష్టవంతుడంటే ఈ పిల్లోడే.. వీడియో

-

Amazing accidental save as boy breaks his friend's fall from third floor balcony

భూమి మీద నూకలుండాలే కానీ.. ఆ యుముడు కూడా ఏం చేయలేడంటారు కదా. అలాగే ఉంది ఈ పిల్లోడి పరిస్థితి. ఏమన్నా టైమింగా? మూడో అంతస్తు నుంచి ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. అదే సమయానికి కింద ఉన్న మరో పిల్లాడు కింద పడ్డ పతంగిని పైకి తీయడానికి కిందికి వంగాడు. అంతే.. వంగిన పిల్లాడి మీద పైనుంచి కిందపడుతున్న పిల్లాడు పడ్డాడు. వాట్ ఏ టైమింగ్. ఒక్క క్షణం అటూ ఇటూ అయినా ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి. ఏది ఏమైనా ఇద్దరూ ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుసాద్‌లో చోటు చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news