ఐపీఎల్ 2023 :కోల్కతా నైట్ రైడర్స్ షాకింగ్ డెసిషన్ !

-

మరో నాలుగు రోజుల్లో ఇండియా వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఎంతో వైభవంగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ లీగ్ లో పాల్గొంటున్న 10 జట్లు తగిన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. అయితే రెండు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించిన కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యారు గాయం కారణంగా దూరం అయ్యే అవకాశాలు ఉండడంతో.. అతని స్థానంలో కెప్టెన్ గా ఎవరు ఉండనున్నారు అన్న విషయం చాలా రోజులుగా చర్చల్లో ఉంది. కానీ ఈ సందేహాలకు తెర దించుతూ కాసేపటి క్రితమే కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తమ జట్టు స్టార్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మన్ నితీష్ రాణాను కెప్టెన్ గా నియమిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా ఇదే టీం లో ఉన్న వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు రస్సెల్ లేదా నరైన్ లను కెప్టెన్ గా చేస్తారని భావించినా ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం షాక్ ఇచ్చిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news