టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలా లేదా దీని ద్వారానే సైబర్ క్రైమ్ లకు పాల్పడుతన్నారని బాధపడాలో తెలియని పరిస్థితి. తాజాగా టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుని 81 మంది బ్యాంకుల నుండి కోటి రూపాయలను కాజేశారు. ముంబైలో ఈ ఘటన జరగడం బాధాకరం అని చెప్పాలి. కొందరు సైబర్ నేరగాళ్లు కావాలనే ఈ 81 మందికి UPI లకు కావాలనే అమౌంట్ పంపించి, ఆ తర్వాత వారే ఫోన్ చేసి పొరపాటున అమౌంట్ వచ్చిందని దయచేసి తిరిగి చెల్లించాలని అడిగి… తద్వారా వారి UPI ఖాతాను హ్యాక్ చేసి మొత్తం కోటి రూపాయలను వారి బ్యాంకు నుండి దొంగిలించారు. ఇది తెలిసినప్పటి నుండి ఫోన్ పే మరియు గూగుల్ పే లాంటి యాప్ లు వాడుతున్న వారు హడలెత్తిపోతున్నారు. మీకు ఏదైనా యాప్ అవసరం అయితే కేవలం ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అని ప్రభుత్వం తెలియచేస్తోంది.