ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ముంబై మరియు గుజరాత్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాహా త్వరగానే పెవిలియన్ బాట పట్టినా … గిల్ (56) మాత్రం టీం స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఐపీఎల్ లో మరో అర్ద సెంచరీని నమోదు చేశాడు. ఇక గుజరాత్ ఇంత భారీ స్కోర్ చేయడానికి కారణం అయిన వారిలో అభినవ్ మనోహర్ (42), మిల్లర్ (46) మరియు ఆఖర్లో రాహుల్ తేవాతియా మూడు సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేశాడు.
ముంబై బౌలర్లలో చావ్లా ఒక్కడే 2 వికెట్లు తీసుకున్నాడు. అర్జున్ టెండూల్కర్ సైతం పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. మరి ముంబై ముందు 207 పరుగుల లక్ష్యం ఉండగా, రోహిత్ అండ్ టీం ఈ స్కోర్ ను ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.