నిజామాబాద్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తాజాగా పరిస్థితులు మారాయి భారతదేశానికి ధాన్యం అందించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బిజెపి రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందని, రైతుల రుణమాఫీ చేయని బీజేపీ బ్యాంకు రుణాల ఎగవేతదారుల బ్యాంకుల రుణాలు మాఫీ చేసిందని ఆయన మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే చేస్తామని ఇచ్చిన హామీల గురించి అడిగిన చోట మత విద్వేషాలు రగుల్చుతున్నారన్నారు. కర్ణాటకలో అదే పరిస్థితి నెలకొందన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నా కేంద్ర ప్రభుత్వంకు.. దేశవ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయని, టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తుందన్నారు.