కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి హోలీ పండుగ సందర్భంగా రూ. 10,000 అడ్వాన్స్…!

-

కొద్ది రోజులుగా హోలీ పండుగ వస్తోంది. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 29 వ తేదీన వచ్చింది. ఇప్పటికే ప్రజలు ఇళ్ళల్లో పండుగకు సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు. ఈ నెల ఆఖరన హోలీ రావడం వలన జీతం ఈ పాటికే అయి పోతోంది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఆఫర్ ని తీసుకొచ్చింది.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద మోడీ ప్రభుత్వం అందించనుంది. గతం లో అయితే ఆరవ పే కమిషన్ కింద రూపాయలు 4500 ఇచ్చేది. ఇప్పుడు రూపాయిలు పది వేలకు పెంచారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ కింద రూపాయలు పది వేలు తీసుకోవచ్చు. ఎటువంటి వడ్డీ కూడా పడదు.

ఈ స్కీం కింద డబ్బులు తీసుకోవాలి అనుకునే వాళ్ళు మార్చి 31వ తేదీలోగా తీసుకోవచ్చు వీటిని పది ఇన్స్టాల్మెంట్స్ లో కట్టాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయలు చొప్పున మీరు పది ఇన్స్టాల్మెంట్ లో చెల్లించుకో వచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీటి కోసం తాజాగా చెప్పడం జరిగింది.

ఈ సదుపాయం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ డబ్బులు తీసుకొని పండుగకి నాడు ఖర్చు పెట్టుకోవచ్చు. అలానే జీతాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఏప్రిల్ 1 నుంచి జీతాల్లో కూడా మార్పులు రావచ్చు అని అంటున్నారు. ఇది నిజంగా ఊరట కలిగిస్తుంది. లక్షల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని కోసం ఎదురు చూస్తున్నారు. అలానే ఏప్రిల్ 1 నుంచి కొత్త వేజ్ కోడ్ కూడా రానుంది. దీని కారణంగా ఉద్యోగుల జీతాలలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పు కారణంగా హోం శాలరీ లో కూడా మార్పులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news