తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఇప్పుడు విజయం సాధించాల్సిన అవసరం వాళ్లకు ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ ప్రచారం చేసే విషయంలో చాలా వరకు కూడా బిజెపి జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్పాలి. బిజెపి నేతలు చాలామంది ఇప్పుడు తమిళనాడు విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం కూడా తమిళనాడు మీద ఎక్కువ ఫోకస్ చేసింది.
అయితే ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ కొంతమంది నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని తమిళనాడు ఎన్నికల ప్రచారానికి బిజెపి ఆహ్వానించే అవకాశాలు ఉండవచ్చు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది ఉన్నారు.
అలాగే మెగా ఫ్యామిలీ అభిమానుల కూడా కొంతమంది ఉన్నారు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేయించే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో బీజేపీ జాతీయ స్థాయి నేతలు మాట్లాడారని దీనికి పవన్ కళ్యాణ్ కూడా సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తమిళనాడు, తిరుపతి ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ప్రచారం చేయవచ్చని జనసేన పార్టీ నేతలు కూడా అంటున్నారు. మరి ఆయన పర్యటన ఎప్పుడు ఉంటుందో చూడాలి.