పన్నెండు పార్శ్వాలుగా శివపురాణ విశిష్టత, శివలీలా మహత్యాలతో కూడిన ఓంకారం యాత్ర, మహా శివరాత్రి సందర్భంగా మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 16 ఫిబ్రవరి 2023: తెలుగు ప్రేక్షకులకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది జీ తెలుగు. ఈ మహా శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక సంగతుల సమాహారంతో ఓంకారం యాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన నేపాల్లో కొలువైన మహాదేవుడి విశేషాలు, విశిష్టత, మహిమలను వివరిస్తూ పన్నెండు భాగాలుగా ప్రత్యేక ఓంకారం కార్యక్రమాన్ని అందిస్తోంది మీ జీ తెలుగు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిమగిరుల్లో కొలువైన కైలాసనాథుని ప్రత్యేక మందిరం డోలేశ్వర్ మహాదేవాలయ దర్శనంతో 18 ఫిబ్రవరి శనివారం ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే మొదటి భాగంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం కానుంది. ఓంకారం యాత్ర విశేషాలు ప్రతి శుక్ర, శని వారాల్లో ఉదయం 8 గంటలకు.. మీ జీ తెలుగులో!

ఈ నెల 18 నుంచి మార్చి 31 వరకు పన్నెండు భాగాలుగా ప్రసారమయ్యే ఈ ప్రత్యేక ఓంకారం కార్యక్రమంలో మహాదేవుడు కొలువైన ఆలయాలు, విశిష్ట నదులు, పూజా విధానాలు, ముద్రలు, మహిమ గల మంత్రాల గురించిన పూర్తి విశేషాలను దేవి శ్రీ గురూజీ తన మాటల్లో వివరిస్తారు.

ఈ ప్రత్యేక యాత్రలో భాగంగా డోలేశ్వర మహాదేవాలయం దర్శనం, శివ పూజా విధానం, మంత్రం విశిష్టత, ముద్ర, బిల్వార్చన విశేషాలను గురూజీ వివరిస్తారు. త్రిశూల్ నది (పోఖారా) అద్భుత దృశ్యాలను చూడవచ్చు. జల వారాహి అమ్మవారి ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత, వారాహి అవతారం, పూజా విధానం గురించిన పూర్తి విషయాలను తెలుసుకోవచ్చు. వింధ్య వాసినీ ఆలయ దర్శనంతోపాటు, జీ తెలుగు ప్రేక్షకులకు గురూజీ మహిమాన్వితమైన అమ్మవారి మంత్రాన్ని ఉద్భోదిస్తారు. శివకేశవులు కొలువైన గుల్ ఈశ్వర్ ఆలయం, ముక్తినాథ్ ఆలయం, జ్వాలాముఖి, గండకీ నది యొక్క అద్భుత దృశ్యాలను వీక్షించవచ్చు.

దక్షణ కాళి ఆలయం, దాని చరిత్రకు సంబంధించిన విశేషాలను కూడా తెలుసుకోవచ్చు. ప్రసిద్ధ శివాలయాలు జలనారాయణ్, పశుపతినాథ్ దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మార్చి 31న ప్రసారమయ్యే 12వ ఎపిసోడ్తో ముగుస్తుంది. చివరి భాగంలో కాలభైరవ మందిరం, కుమారి దర్బార్ దేవాలయం దర్శనంతోపాటు, గురూజీ ఆలయ విశిష్టత, చరిత్రను వివరిస్తారు.

ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవి శ్రీ గురూజీ ముద్రల యొక్క ప్రాముఖ్యత, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మానవ జీవితంలో వాటి ప్రాధాన్యం వివరిస్తారు. నేపాల్లోని సుందరమైన ప్రాంతాల దర్శనం, విశి

Read more RELATED
Recommended to you

Latest news