రుణగ్రహీతలకి గుడ్ న్యూస్.. రూ.లక్షకు రూ.630 ఈఎంఐ..!

-

ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI కస్టమర్స్ కి ఒక గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి బాగా రిలీఫ్ గా ఉంటుంది అనే చెప్పాలి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ పై వడ్డీ రేట్లను తగ్గించేసింది. దీని వలన కస్టమర్స్ కి లాభదాయయకంగా, రిలీఫ్ గా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

ఈ బ్యాంక్ వడ్డీ రెట్లని తగ్గించేసింది. హోమ్ లోన్స్‌ పై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్లను తగ్గించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే విధంగా వెహికల్ లోన్స్‌ పై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది బ్యాంక్. ఇది ఇలా ఉంటే రేట్ల కోత తగ్గింపు నేపథ్యం లో బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి స్టార్ట్ అవుతున్నాయి.

రూ.లక్షకు ఈఎంఐ రూ.632 నుంచి ఉంటుంది. ఇక వెహికిల్ లోన్స్ గురించి చూసుకున్నట్టయితే వెహికల్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.85 శాతం నుంచి మొదలు అవుతోంది. ఇది ఇలా ఉంటే బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై‌ వడ్డీ రేటు 6.85 శాతంగా ఉండేది.

అలాగే వెహికల్ లోన్‌పై వడ్డీ రేటు గతంలో 7.35 శాతంగా ఉండేది. అయితే అక్టోబర్ 18 నుంచి ఈ కొత్త రేట్లు అమలు లోకి రావడం జరిగింది. అయితే డిసెంబర్ వరకు ఇదే రేట్లు కొనసాగుతాయి. అలానే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news