‘మా’ వివాదంపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వాళ్లంతా జోకర్లే !

-

టాలీవుడ్ సంచలనం మరియు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏదో ఓ విషయంపై.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు రామ్ గోపాల్ వర్మ. రాజకీయ నాయకులు మరియు సినీ తారల పై కూడా కామెంట్లు చేస్తూ ఎప్పుడు వార్తల్లో కూడా నిలుస్తారు.

RGV Sensation Tweet about his Birthday

అయితే తాజాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదంపై ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు. మా అసోసియేషన్ లో సర్కస్ అని.. రెండు రోజుల కింద ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ… తాజాగా మరోసారి మా వివాదంపై క్రియేట్ చేశారు.

మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో చీలికలు తెచ్చిన సంగతి తెలిసిందే. రిగ్గింగ్ జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తుంటే…. అదేం లేదని మంచు విష్ణు ప్యానెల్ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news